
భారత హాకీ కోచ్ మరీనే
(ఇఫో) మలేసియా: ప్రపంచకప్‌లో ప్రతి మ్యాచ్‌లో అత్యుత్తమ ఆటతీరు కనబర్చడమే తమ ముందున్న లక్ష్యమని... ప్రత్యర్థి, పూల్‌లతో సంబంధం లేకుండా ముందుకు సాగడమే ముఖ్యమని భారత హాకీ జట్టు ప్రధాన కోచ్ జోయర్డ్ మరీనే అన్నారు. ఈ ఏడాది చివర్లో భారత్ ఆతిథ్యమిస్తున్న ప్రపంచకప్ హాకీ షెడ్యూల్ విడుదల నేపథ్యంలో కోచ్ మరీనే మాట్లాడుతూ... ‘ప్రతి జట్టు గెలవాలనే ఈ మెగా టోర్నీకి వస్తుంది. అందువల్ల మన జట్టుకు సులువైన ‘డ్రా’ లభించిందా... కఠినమైనదా అనేదానితో సంబంధం లేకుండా ప్రత్యర్థులను గౌరవించాల్సిన అవసరం ఉంది.
ఇక్కడ ర్యాంకింగ్స్‌తో పనిలేదు. టైటిల్ నెగ్గాలంటే ఉత్తమ ప్రతిభ కనబర్చాల్సిందే. నిర్లక్ష్యానికి తావివ్వకుండా ఆడాల్సిందే. దాని కోసం ఆటగాళ్లను శారీరకంగా మానసి కంగా సిద్ధంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని తెలిపారు.