
సిడ్నీ:వచ్చే నెలలో జరిగే యాషెస్ సిరీస్ కు సంబంధించి ఆస్ట్రేలియా అప్పుడే మాటల యుద్ధం మొదలు పెట్టేసింది. తమ మాటల ద్వారానే ప్రత్యర్థినే సాధ్యమైనంత వరకూ వెనక్కునెట్టేసే ఆసీస్.. ప్రతిష్టాత్మక యాషెస్ లో తలపడే ఇంగ్లండ్ పై సరికొత్త స్లెడ్జింగ్ కు తెరలేపింది. ప్రధానంగా యాషెస్ కు వెళ్లే ఇంగ్లండ్ జట్టులో ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ను ఎంపిక చేయకపోవడాన్ని ఆసీస్ మాజీలు ప్రత్యేక టార్గెట్ గా పెట్టుకున్నారు. స్టోక్స్ లేకపోతే యాషెస్ గెలవలేరంటూ ఇటీవల ఆసీస్ దిగ్గజ ఆటగాడు ఇయాన్ చాపెల్ అభిప్రాయపడగా.. తాజాగా అతని సరసన ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ వా కూడా చేరిపోయాడు.
'స్టోక్స్ లేకుండా యాషెస్ సిరీస్ ను ఇంగ్లండ్ గెలవలేదు. అతను యాషెస్ లో లేకపోతే ఇంగ్లండ్ ఆ సిరీస్ గెలిచే ప్రసక్తే ఉండదు. ఆ సమయానికి స్టోక్స్ వస్తాడనే నేను అనుకుంటున్నా. ఏదో రకంగా స్టోక్స్ ను ఆసీస్ కు పంపడానికి ఇంగ్లండ్ సెలక్టర్లు కృషి చేస్తారు. ఎందుకంటే అతనొక అత్యుత్తమ ఆటగాడు కాబట్టి. ఒకవేళ యాషెస్ కు చివరి నిమిషంలో స్టోక్స్ కనుక పంపిస్తే అంతకంటే అవమానం ఒకటి ఉండదు'అని స్టీవ్ వా పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment