
ట్రైథ్లాన్ సిరీస్ లో ఇంగ్లండ్ కు బంగారు పతకం
కామన్వెల్త్ భాగంగా ఇక్కడ జరిగిన ట్రైథ్లాన్ సిరీస్ లో ఇంగ్లండ్ బంగారు పతకాన్ని గెలుచుకుంది.
గ్లాస్గో: కామన్వెల్త్ భాగంగా ఇక్కడ జరిగిన 20వ కామన్వెల్త్ గేమ్స్ లోఇంగ్లండ్ తొలి బంగారు పతకాన్ని గెలుచుకుంది. వివిధ విభాగాలకు గాను జరిగే ట్రైథ్లాన్ సిరీస్ లోఇంగ్లండ్ తరుపున బరిలోకి దిగిన జోడీ స్టింప్సన్ బంగారు పతకాన్ని గెలుచుకుని శుభారంభం చేసింది. 2013 లో ప్రపంచ ట్రైథ్లాన్ సిరీస్ లో రజక పతకం గెలుచుకున్న స్టింప్సన్.. మూడు విభాగాల్లోనూ అద్వితీయమైన ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ ను కైవసం చేసుకుంది. తొలుత 10 కి.మీ పరుగు పందెంలో ఆకట్టుకున్న స్టింప్సన్.. 1.5 కి.మీ స్మిమ్మింగ్ విభాగంలోనూ, 40 కి.మీ సైక్లింగ్ విభాగంలోనూ పై చేయి సాధించింది.
ఈ విభాగంలో కెనాడాకు చెందిన కిరెస్టెన్ స్వీట్లాండ్ రజక పతకాన్ని గెలుచుకోగా, ఇంగ్లండ్ కే చెందిన వికీ హోలాండ్ కాంస్య పతకాన్ని చేజిక్కించుకుంది.