క్రికెట్‌ లవర్స్‌కు పండుగ | Festival to Cricket Lovers | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ లవర్స్‌కు పండుగ

Published Sat, Sep 21 2013 7:38 PM | Last Updated on Fri, Sep 1 2017 10:55 PM

క్రికెట్‌ లవర్స్‌కు పండుగ

క్రికెట్‌ లవర్స్‌కు పండుగ

క్రికెట్‌ లవర్స్‌కు పండుగ వచ్చేసింది.  చాంపియన్స్‌ లీగ్‌ టి20 (సిఎల్టి) చడీ చప్పుడు కాకుండా ఈరోజు ప్రారంభం కాబోతుంది.  ఐపిఎల్(ఇండియన్ ప్రిమీయర్ లీగ్) అంత ఫాలోయింగ్‌ చాంపియన్స్‌ లీగ్‌కు  లేదని ఇప్పటి వరకు భావించారు. క్రికెట్‌ను పిచ్చపిచ్చగా ఆదరించే మన దేశంలో క్రికెట్‌ ప్లేయర్లను దేవుళ్లుగా కొలుస్తారు. స్టార్‌ ప్లేయర్లుంటే చాలు ఏ టోర్నీ అయినా గ్రాండ్‌ సక్సెస్‌. అందులోనూ సచిన్‌ టెండూల్కర్‌, రాహుల్‌ ద్రావిడ్‌, శిఖర్‌ ధావన్‌ బరిలో దిగుతున్నారంటే గోలగోలే!  స్టేడియంలు ఫ్యాన్స్ ఈలలు, గోలతో మార్మోగుతాయి.

చాంపియన్స్‌ లీగ్‌కు  ఐపిఎల్ మాదిరి హడావిడి కనిపించడం లేదు. న్యూజిలాండ్‌కు చెందిన ఒటాగో వోల్ట్స్‌ టీమ్‌ గురించి ఎంత మంది క్రికెట్‌ ఫ్యాన్స్‌కు తెలుసు. ఆ టీమ్‌లో ఎవరెవరు వున్నారో ఓ అయిదుగురి క్రీడాకారుల పేర్లు ఎవరైనా చెప్పగలరా? అంటే లేదనే సమాధానం వస్తుంది. ఈ నేపథ్యంలో చాంపియన్స్‌ లీగ్‌ టోర్నీ చూసేందుకు కొన్ని కారణాలు వున్నాయి.


ది వాల్‌ అనే ముద్దు పేరుతో పదిహేడేళ్లుగా ఇండియన్‌ క్రికెట్‌కు సేవలందించిన రాహుల్‌ ద్రావిడ్‌కు ఇదే చివరి టోర్నమెంట్‌. రాజస్థాన్‌ రాయల్స్‌కు ద్రావిడ్‌ తన చివరి టోర్నీలో ఆడుతున్నాడు. గొప్ప టెస్ట్‌ క్రికెటర్‌ అయిన ద్రావిడ్‌ టి ట్వంటీ టోర్నీల్లోనూ చెప్పుకోదగ్గ రన్స్‌ తీయడమే కాకుండా, టీమ్‌ను గెలుపు బాటలో నడిపిస్తున్న కెప్టెన్‌ కూడా. అందుకే ఐపిఎల్లో మూడో స్థానం పొందిన రాజస్థాన్‌ రాయల్స్‌ చాంపియన్స్‌ లీగ్‌కు క్వాలిఫై అయింది. ముగ్గురు ప్లేయర్లు స్పాట్‌ ఫిక్సింగ్ వూబిలో కూరుకుపోయి టీమ్‌కు దూరమైనప్పటికీ, అందుబాటులో వున్న వారితోనే జైత్రయాత్ర సాగించడం ద్రావిడ్‌ ప్రత్యేకత.

ఇక టెస్ట్‌ క్రికెట్‌లో అత్యధికంగా 198 మ్యాచ్‌లు ఆడిన స్టార్‌ బ్యాట్స్‌మన్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఇటీవల ఆడిన ఐపిఎల్ తన చివరి టోర్నీ అన్నాడు. వచ్చే ఏడాది ఊపిఎల్ లాంటి పొట్టి ఫార్మాట్లో సచిన్‌ ఆటను మన చూసే అవకాశం లేదు. అందుకే చాంపియన్స్‌ లీగ్‌ టోర్నీలోనే చివరి సారిగా సచిన్‌ను ఈ పొట్టి ఫార్మాట్లో ఆడటాన్ని తనవి తీరా చూసే చాన్సుంది. గాయాన్ని సైతం లెక్క చేయక ఐపిఎల్ జైత్రయాత్రలో కీలక పాత్ర పోషించిన సచిన్‌ లాంటి మెగా ప్లేయర్‌కు ఈ పొట్టి ఫార్మాట్లో గ్రాండ్‌గా వీడ్కోలు ఇవ్వాల్సిందిగా మాజీ లెగ్‌ స్పిన్నర్‌, ముంబై ఇండియన్స్‌ మెంటర్‌ అనిల్‌ కుంబ్లే ఫ్యాన్స్‌ను కోరారు.

గత ఏడాదిగా న్యూస్‌ మేకర్‌ క్రికెటర్‌ ఎవరంటే శిఖర్‌ ధావన్‌ అనే చెప్పుకోవాలి. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో అదుర్స్‌ అనిపించిన ఈ ఓపెనర్‌ ఐపిఎల్ లాంటి పొట్టి క్రికెట్లోనూ సత్తా చాటి వన్డే టీమ్‌కు సెలెక్టయ్యాడు. చాంపియన్స్‌ ట్రోఫీలో ఆ తర్వాత వెస్టిండీస్‌లో జరిగిన ట్రై సిరీస్‌లో, ఆ తర్వాత జింబాబ్వేలో జరిగిన సిరీస్‌లోనూ శిఖర్‌ ధావన్‌ తనేమిటో రుజువు చేసుకున్నాడు. ఫలితంగా సంగక్కర గైర్హాజరీలో వైస్‌ కెప్టెన్‌ కామెరూన్‌ వైట్‌ నుండి సన్‌ రైజర్స్‌ టీమ్‌ కెప్టెన్సీని ధావన్‌ చేజిక్కించుకున్నాడు కూడా. సిఎల్టికి ఐపిఎల్కు వున్న ఆదరణ లేదని బాధపడేవారికి ఇది ఓ శుభవార్తే.  ఈ టోర్నీలో నాలుగు ఇండియా టీమ్స్‌ బరిలో వున్నాయి. ఈ స్టార్‌ ప్లేయర్ల యాక్షన్‌ను షార్ట్‌ ఫార్మాట్లో చూసి ఆనందించడం ఇక మీ వంతే.

ఈ రోజు రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే చాంపియన్స్ లీగ్-2013 తొలి పోరులో రాజస్థాన్ రాయల్స్ తమ సొంతగడ్డపై ఐపీఎల్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో తలపడనుంది.

చాంపియన్స్ లీగ్ టి20 షెడ్యూల్
 సెప్టెంబర్ - 21 - ముంబై ఇండియన్స్ - రాజస్థాన్ రాయల్స్-జైపూర్ - రా. గం. 8 నుంచి
           22- బ్రిస్బేన్ హీట్ - ట్రినిడాడ్ అండ్ టొబాగో -రాంచీ-    సా. గం. 4 నుంచి
              చెన్నై సూపర్ కింగ్స్ - టైటాన్స్    -రాంచీ -రా. గం. 8 నుంచి
    23    -హైవెల్డ్ లయన్స్ - పెర్త్ స్కార్చర్స్    -అహ్మదాబాద్-సా. గం. 4 నుంచి
       ముంబై ఇండియన్స్ - ఒటాగో వోల్ట్స్    -అహ్మదాబాద్- రా. గం. 8 నుంచి
 24    -బ్రిస్బేన్ హీట్ - టైటాన్స్    మొహాలీ-    సా. గం. 4 నుంచి
     సన్‌రైజర్స్ -ట్రినిడాడ్ అండ్ టొబాగో-    మొహాలీ-రా. గం. 8 నుంచి
 25    -పెర్త్ స్కార్చర్స్ - ఒటాగో వోల్ట్స్    -జైపూర్    -గం. సా. 4 నుంచి
     రాజస్థాన్ రాయల్స్ - హైవెల్డ్ లయన్స్-    జైపూర్-    గం. రా. 8 నుంచి
 26    -సన్‌రైజర్స్ - చెన్నై సూపర్ కింగ్స్    -రాంచీ-    రా. గం. 8 నుంచి
 27    -ముంబై ఇండియన్స్ - హైవెల్డ్ లయన్స్-అహ్మదాబాద్-రా. గం. 8 నుంచి
 28    -సన్‌రైజర్స్ - టైటాన్స్    -రాంచీ-    సా. గం. 4 నుంచి
     చెన్నై సూపర్ కింగ్స్ - బ్రిస్బేన్ హీట్    -రాంచీ-రా. గం. 8 నుంచి
 29    -హైవెల్డ్ లయన్స్ - ఒటాగో వోల్ట్స్-    జైపూర్-    సా. గం. 4 నుంచి
     రాజస్థాన్ రాయల్స్ - పెర్త్ స్కార్చర్స్-    జైపూర్    -రా. గం. 8 నుంచి
 30    -టైటాన్స్ - ట్రినిడాన్ అండ్ టొబాగో-    అహ్మదాబాద్-   సా. గం. 4 నుంచి
     సన్‌రైజర్స్ -బ్రిస్బేన్ హీట్    -అహ్మదాబాద్-  రా. గం. 8 నుంచి
 అక్టోబర్
 1    -రాజస్థాన్ రాయల్స్ -ఒటాగో వోల్ట్స్    -జైపూర్-    రా. గం. 8 నుంచి
 2    -ముంబై ఇండియన్స్ -పెర్త్ స్కార్చర్స్-ఢిల్లీ-    గం. సా. 4 నుంచి
     చెన్నై సూపర్ కింగ్స్- ట్రినిడాడ్ అండ్ టొబాగో-    ఢిల్లీ-గం. రా. 8 నుంచి
 4    -తొలి సెమీ ఫైనల్ (ఎ1-బి2)    -జైపూర్    -రా. గం. 8 నుంచి
 5    -రెండో సెమీ ఫైనల్ (ఎ2-బి1)-    ఢిల్లీ-    రా. గం. 8 నుంచి
 6    -ఫైనల్    -ఢిల్లీ    -రా. గం. 8 నుంచి
 ఏ గ్రూప్‌లో ఎవరు
 గ్రూప్ ‘ఎ’: ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, హైవెల్డ్ లయన్స్, పెర్త్ స్కార్చర్స్, ఒటాగో వోల్ట్స్
 గ్రూప్ ‘బి’: చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్, బ్రిస్బేన్ హీట్, టైటాన్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగో

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement