ఫిట్‌నెస్‌ను పరీక్షించుకున్నా
బంగ్లాదేశ్ ‘ఎ’ తో మూడు రోజుల మ్యాచ్ ఆడటం ద్వారా తన మ్యాచ్ ఫిట్‌నెస్‌ను పరీక్షించుకున్నానని భారత ఓపెనర్ శిఖర్ ధావన్ చెప్పాడు. శ్రీలంకలో తన చేతికి అయిన గాయం పూర్తిగా మానిందని, దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ముందు బంగ్లాదేశ్‌పై సెంచరీ తన ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని తెలిపాడు.
‘ఎ’ జట్టుకు సారథ్యం వహించడం వల్ల యువ క్రికెటర్లలో ఉన్న సత్తా ప్రత్యక్షంగా చూశానని ధావన్ చెప్పాడు.