
ముంబై: బంగ్లాదేశ్‌తో టి20 సిరీస్‌కు ఎంపికైనా మ్యాచ్ ఆడే అవకాశం దక్కని కేరళ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ సంజు సామ్సన్‌కు మరో అవకాశం లభించింది. గాయంతో విండీస్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు దూరమైన శిఖర్ ధావన్ స్థానంలో సామ్సన్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడుతున్న సమయంలో ధావన్ ఎడమ మోకాలికి గాయమైంది. ‘బీసీసీఐ వైద్య బృందం ధావన్ గాయాన్ని పరీక్షించింది. అది మానేందుకు, కుట్లు తొలగించేందుకు కొంత సమయం పడుతుందని అభిప్రాయ పడింది. దాంతో ధావన్ స్థానంలో సామ్సన్‌ను ఎంపిక చేశాం’ అని బోర్డు ప్రకటించింది.