జాక్పాట్లు..షాక్లు..!
ముంబై:ఊహించని పరిణామాలు చోటు చేసుకోవడం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వేలంలో సర్వ సాధారణం. ఇక్కడ ఎటువంటి అంచనాలు లేకుండా బరిలో నిలిచిన ఆటగాళ్లు జాక్ పాట్ కొట్టడం ఒకటైతే, అత్యధిక ధర పలుకుతాడనుకునే క్రికెటర్లను అసలు ఎవ్వరూ పట్టించుకోక పోవడం మరొకటి. ఐపీఎల్ ఆరంభం నుంచి ఇదే పరిస్థితి కనిపిస్తోంది.. మరొకసారి కూడా అదే కనిపించింది. ఐపీఎల్ -10 సీజన్ కు సంబంధించి సోమవారం నాటి వేలంలో ఊహించని పరిణామాలే చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ క్రికెటర్లు బెన్ స్టోక్స్(రూ.14.5 కోట్లు), తైమాన్ మిల్స్(రూ.12 కోట్లు) అత్యధిక ధర పలికిన ఆటగాళ్లలో వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచారు. మరొకవైపు ఇషాంత్ శర్మ, చటేశ్వర పూజారా, ఇర్ఫాన్ పఠాన్ లను ఎవ్వరూ పట్టించుకోలేదు. ఐపీఎల్ వేలం సందర్భంగా కొంతమంది క్రికెటర్ల ముఖాలు వెలిగిపోతే, మరి కొంతమంది మాత్రం తీవ్ర నిరాశలో కూరుకుపోయారు.
పలువురు ఐపీఎల్ ఆటగాళ్ల వేలం వివరాలు..
భారత ఆటగాడు ఇషాంత్ శర్మ(అన్ సోల్డ్)
దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ డేవిడ్ వైజ్(అన్ సోల్డ్)
భారత ఆటగాడు కరుణ్ శర్మ- ధర రూ. 3 20 కోట్లు- ముంబై ఇండియన్స్
వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్(అన్ సోల్డ్)
ఇంగ్లండ్ ఆల్ రౌండర్ క్రిస్ వోక్స్-ధర రూ. 4.20 కోట్లు- కోల్ కతా నైట్ రైడర్స్
భారత ప్లేయర్ పర్వేజ్ రసూల్( అన్ సోల్డ్)
ఆస్ట్రేలియా ఆటగాడు నిక్ మ్యాడిన్సన్(అన్ సోల్డ్)
వెస్టిండీస్ ఆటగాడు ఎవిన్ లూయిస్(అన్ సోల్డ్)
వెస్టిండీస్ ఆటగాడు డారెన్ బ్రేవో(అన్ సోల్డ్)
వెస్టిండీస్ ఆటగాడు మార్లోన్ శ్యామ్యూల్స్( అన్ సోల్డ్)
భారత ఆటగాడు బద్రీనాథ్. ఎస్( అన్ సోల్డ్),
భారత ఆటగాడు అభినవ్ ముకుంద్(అన్ సోల్డ్)
ఆసీస్ ఆటగాడు మైకేల్ క్లింగర్(అన్ సోల్డ్)
భారత ఆటగాడు చటేశ్వర పూజారా(అన్ సోల్డ్)
భారత ఆటగాడు మనోజ్ తివారీ(అన్ సోల్డ్)
భారత ఆటగాడు ప్రవీణ్ తాంబే- ధర రూ. 10 లక్షలు-సన్ రైజర్స్ హైదరాబాద్
భారత్ ఆటగాడు పవన్ నేగీ-ధర రూ. కోటి-ఆర్సీబీ
శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్-ధర రూ. 2 కోట్లు(ఢిల్లీ డేర్ డెవిల్స్)
భారత ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్(అన్ సోల్డ్)
ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్-ధర రూ. 14.5 కోట్లు
న్యూజిలాండ్ ఆటగాడు కోరీ అండర్సన్ ధర రూ కోటి(ఢిల్లీ డేర్ డెవిల్స్)
దక్షిణాఫ్రికా ఆటగాడు సీన్ అబాట్(అన్ సోల్డ్)
ఆఫ్ఘాన్ లెగ్ స్పిన్నర్ రషిద్ ఖాన్-ధర రూ. నాలుగు కోట్లు(సన్ రైజర్స్ హైదరాబాద్)
భారత ఆటగాడు మురుగన్ అశ్విన్-ధర రూ. కోటి(ఢిల్లీ డేర్ డెవిల్స్)
భారత ఆటగాడు నాథూ సింగ్-ధర రూ.50 లక్షలు(గుజరాత్ లయన్స్)
భారత ఆటగాడు టీ నటరాజన్-ధర రూ. 3 కోట్లు( కింగ్స్ పంజాబ్)
భారత ఆటగాడు అంకిత్ చౌదరి-ధర రూ. 2 కోట్లు( రాయల్ చాలెంజర్స్ బెంగళూరు)
ఆఫ్ఘాన్ ఆటగాడు మొహ్మద్ నబీ-ధర రూ. 30 లక్షలు( సన్ రైజర్స్ హైదరాబాద్)
భారత్ ఆటగాడు అంకిత్ భావే-ధర రూ. 10 లక్షలు( ఢిల్లీ డేర్ డెవిల్స్)
భారత ఆటగాడు ఉన్ముక్త్ చంద్(అన్ సోల్డ్)
ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ డాన్ క్రిస్టియన్-ధర రూ. కోటి( పుణె సూపర్ జెయింట్స్)
భారత బౌలర్ మునాఫ్ పటేల్-ధర రూ. 30 లక్షలు( గుజరాత్ లయన్స్)
వెస్టిండీస్ ఆటగాడు డారెన్ స్యామీ-ధర రూ. 30 లక్షలు( కింగ్స్ పంజాబ్)
శ్రీలంక ఆటగాడు గుణరత్నే -ధర రూ. 30 లక్షలు(ముంబై ఇండియన్స్)