కాన్బెర్రా: వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్మన్ క్రిస్ గేల్ రెచ్చిపోతున్నాడు. 51 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ చేసిన గేల్ (77) సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. కముంగోజి బౌలింగ్లో గేల్ వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. కాగా శామ్యూల్స్ (44) మరీ నింపాదిగా ఆడుతున్నాడు. ప్రపంచ కప్ పూల్-బిలో భాగంగా జింబాబ్వేతో మ్యాచ్లో వెస్టిండీస్ 27 ఓవర్లలో వికెట్ నష్టానికి 128 పరుగులు చేసింది.