12 బంతుల్లో హాఫ్సెంచరీ చేసిన క్రిస్ గేల్
డాక్లాండ్స్: వెస్ట్ ఇండిస్ విధ్వంసకర బ్యాట్స్మెన్ క్రిస్ గేల్ మరోసారి తన విశ్వరూపం చూపించాడు. 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి యువరాజ్ సింగ్ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు.
ఆడిలైడ్ స్ట్రైకర్స్తో మెల్బోర్న్ రెనిగేడ్స్తో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ టీ20 మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన ఆడిలైడ్ టీం 170 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన మెల్బోర్న్ టీం ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్ క్రిస్ గేల్ తొలి ఓవర్లోనే 4 సిక్సర్లు కొట్టడంతో 27 పరుగులు చేసింది. ఈ క్రమంలో క్రిస్ గేల్ ఏడు సిక్సర్లు, ఒక ఫోర్తో 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మొత్తం 17 బంతులు ఆడిన గేల్ 56 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే గేల్ చెలరేగినా మెల్బోర్న్ రెనిగేడ్స్ మాత్రం గెలవలేక పోయింది. 15.3 ఓవర్లలోనే 143 పరుగులు చేసి ఆలౌటయింది.