
క్రిస్ జి'గేల్'.. సెంచరీ
కాన్బెర్రా: వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్మన్ క్రిస్ గేల్ మెరిశాడు. జింబాబ్వేతో మ్యాచ్లో గేల్ (108) మెరుపు ఇన్నింగ్స్తో రెచ్చిపోయి సెంచరీ చేశాడు. గేల్ 5 ఫోర్లు, 6 సిక్సర్లతో చెలరేగాడు. గేల్ సెంచరీకి తోడు శామ్యూల్స్ (59) హాఫ్ సెంచరీ చేశాడు. కాగా శామ్యూల్స్ నింపాదిగా ఆడాడు.
ప్రపంచ కప్ పూల్-బిలో భాగంగా జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్లో వెస్టిండీస్ 37 ఓవర్లలో వికెట్ నష్టానికి 177 పరుగులు చేసింది. వెస్టిండీస్ పరుగుల ఖాతా తెరవకనే తొలి వికెట్ కోల్పోయింది. విండీస్ ఓపెనర్ డ్వెన్ స్మిత్.. ఇన్నింగ్స్ రెండో బంతికే బౌల్డయ్యాడు. అయితే గేల్, శామ్యూల్స్ క్రీజులో పాతుకుపోయి విండీస్ను ఆదుకున్నారు. శామ్యూల్స్ నింపాదిగా ఆడగా, గేల్ మొదట్నుంచి బ్యాట్ ఝళిపించాడు.