ఆంటిగ్వా: వెస్టిండీస్ హార్డ్ హిట్టర్ క్రిస్ గేల్ ఒక ఎయిర్‌లైన్ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన విమాన ప్రయాణంలో భాగంగా టికెట్ కన్‌ఫర్మ్ అయినప్పటికీ అనుమతించకపోవడాన్ని గేల్ తీవ్రంగా తప్పుబట్టాడు. ‘ నేను విమాన టికెట్‌ను బుక్ చేసుకున్నా. అది కన్‌ఫర్మ్ అయ్యింది. కానీ నన్ను విమానంలో ప్రయాణించడానికి ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ అనుమతించలేదు. ఓవర్ బుకింగ్ అయ్యిందంటూ సాకులు చెప్పారు. ఇది నన్ను తీవ్రంగా కలచివేసింది. ఇది నా జీవితంలో చేదు అనుభవం’ అని గేల్ పేర్కొన్నాడు.
బిజినెస్ క్లాస్ టికెట్ తీసుకున్న తనను ఎకానమీ క్లాస్ ప్రయాణించేలా చూశారన్నాడు. దాన్ని తిరస్కరించి తదుపరి విమానంలో ప్రయాణించానని గేల్ ట్వీటర్‌లో పేర్కొన్నాడు. కాకపోతే ఎక్కడ్నుంచి ఎక్కడికి ప్రయాణం చేయాల్సిన పరిస్థితుల్లో గేల్‌కు ఈ పరిస్థితి ఎదురయ్యిందనే విషయం మాత్రం చెప్పలేదు.
ఇటీవల భారత్‌తో ఆగస్టులో జరిగిన మ్యాచ్‌లో విండీస్ తరఫున కనిపించిన గేల్.. 42 బంతుల్లో 72 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో విండీస్‌పై భారత్ విజయం సాధించింది. కోహ్లి అద్భుతమైన సెంచరీ చేయడంతో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
So disappointed @emirates, I have a confirmed flight and they gonna tell me that they are over booked, WTF! Not only that, @emirates want me to travel economy when it’s a business class ticket - so now I have to travel on a later flight! Just ridiculous @emirates!Bad experience😡
— Chris Gayle (@henrygayle) November 4, 2019
Comments
Please login to add a commentAdd a comment