వచ్చే నెలలో వాళ్లిదరి పెళ్లి లేనట్టే! | Geeta Basra- Harbhajan not getting married in October? | Sakshi
Sakshi News home page

వచ్చే నెలలో వాళ్లిదరి పెళ్లి లేనట్టే!

Published Sat, Sep 12 2015 3:00 PM | Last Updated on Sun, Sep 3 2017 9:16 AM

వచ్చే నెలలో వాళ్లిదరి పెళ్లి లేనట్టే!

వచ్చే నెలలో వాళ్లిదరి పెళ్లి లేనట్టే!

భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్, బాలీవుడ్ నటి గీతా బస్రా పెళ్లి వాయిదా పడినట్టు సమాచారం. వచ్చే నెల 29న ఢిల్లీలో పెళ్లి చేసుకోవాలని ఈ ప్రేమ జంట ఇటీవల నిర్ణయించినట్టు వార్తలు వచ్చాయి. అయితే హర్భజన్ సింగ్ సన్నిహితుడు ఈ వార్తను తోసిపుచ్చాడు. భజ్జీ, బస్రాల పెళ్లి అక్టోబర్లో ఉండదని చెప్పాడు.  

'హర్భజన్, అతని కుటుంబం వివాహ తేదీని ఇంకా నిర్ణయించలేదు. వివాహ వేదికను కూడా బుక్ చేయలేదు. నవంబర్ 2 నుంచి హర్భజన్ క్రికెట్ సిరీస్లో పాల్గొంటాడు. దీంతో హర్భజన్ పెళ్లి డిసెంబర్ లేదా వచ్చే ఏడాది ఉండొచ్చు. ఏ విషయాన్ని ఇంకా ఖరారు చేయలేదు' అని భజ్జీ సన్నిహితుడు చెప్పాడు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement