భజ్జీకి తండ్రిగా ప్రమోషన్
లండన్: టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్కు తండ్రిగా ప్రమోషన్ లభించింది. అతని భార్య గీతా బస్రా లండన్లోని ఓ ఆస్పత్రిలో బుధవారం పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని భజ్జీ తల్లి అవతార్ కౌర్ మీడియాకు వెల్లడించింది. తల్లి, బిడ్డ ఆరోగ్యం ఉన్నట్లు ఆమె పేర్కొంది. తొలి కాన్పులో భాగంగా కొన్ని వారాల క్రితం గీతా బస్రా లండన్లోని తన తల్లి దండ్రులకు వద్దకు వెళ్లిన సంగతి తెలిసిందే. 2015, అక్టోబర్లో హర్భజన్ సింగ్-గీతాబస్రాలు వివాహం చేసుకున్నారు. ఆ జంట ఆరు సంవత్సరాలు ప్రేమించుకున్న తరువాత పెద్దల అంగీకారంతో గతేడాది ఒక్కటైంది.