పట్టు బిగించిన ఆంధ్ర | good position for andhra | Sakshi
Sakshi News home page

పట్టు బిగించిన ఆంధ్ర

Published Thu, Jan 15 2015 12:36 AM | Last Updated on Sat, Jun 2 2018 5:38 PM

పట్టు బిగించిన ఆంధ్ర - Sakshi

పట్టు బిగించిన ఆంధ్ర

తిపురతో రంజీ ట్రోఫీ మ్యాచ్

సాక్షి, ఒంగోలు: రంజీ ట్రోఫీలో ఆంధ్ర జట్టు మరో విజయంపై కన్నేసింది. త్రిపురతో ఇక్కడ జరుగుతున్న మ్యాచ్‌లో రెండో రోజే పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగుల భారీ ఆధిక్యం సాధించిన ఆంధ్ర రెండో ఇన్నింగ్స్‌లోనూ త్రిపురను దెబ్బ తీసింది. బుధవారం ఆట ముగిసే సమయానికి త్రిపుర తమ రెండో ఇన్నింగ్స్‌లో 9.1 ఓవర్లలో 13 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.

శివకుమార్ 2, విజయ్ కుమార్ 1 వికెట్ తీశారు. ప్రస్తుతం చేతిలో 7 వికెట్లతో మరో 146 పరుగులు వెనుకబడి ఉన్న త్రిపుర, మూడో రోజు ఏ మాత్రం నిలబడగలదో చూడాలి. అంతకు ముందు ఆంధ్ర తమ తొలి ఇన్నింగ్స్‌లో 310 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మొహమ్మద్ కైఫ్ (240 బంతుల్లో 109; 16 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించగా... రికీ భుయ్ (197 బంతుల్లో 87; 12 ఫోర్లు) ఆ అవకాశం కోల్పోయాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 194 పరుగులు జోడించడం విశేషం. త్రిపుర బౌలర్లలో మురాసింగ్ 5 వికెట్లు పడగొట్టాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement