ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
సిడ్నీ: రియో ఒలింపిక్స్ ముందు జరుగుతున్న చివరి సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో హైదరాబాద్ ప్లేయర్ ఆర్.ఎం.వి. గురుసాయిదత్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి మ్యాచ్‌లో గురుసాయిదత్ 21-7, 21-14తో ఫారిమన్ (ఆస్ట్రేలియా)పై... రెండో మ్యాచ్‌లో 21-16, 21-12తో జియాన్ చియాంగ్ (మలేసియా)పై గెలిచాడు. బుధవారం మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి.
భారత్ తరఫున మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్, పీవీ సింధు, తన్వీ లాడ్... పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, సమీర్ వర్మ బరిలో ఉన్నారు. బుధవారం జరిగే మ్యాచ్‌ల్లో లాయ్ (ఆస్ట్రేలియా)తో సైనా; మిన్ (దక్షిణ కొరియా)తో సింధు; టిఫానీ (ఆస్ట్రేలియా)తో తన్వీ లాడ్... అంగుస్ (హాంకాంగ్)తో శ్రీకాంత్; హు యున్ (హాంకాంగ్)తో గురుసాయిదత్; ముస్తఫా (ఇండోనేసియా)తో సమీర్ వర్మ తలపడతారు.
మెయిన్ ‘డ్రా’కు గురుసాయిదత్
Published Tue, Jun 7 2016 11:37 PM | Last Updated on Mon, Sep 4 2017 1:55 AM
Advertisement
Advertisement