బౌలింగ్ పరీక్షలో హఫీజ్ మళ్లీ విఫలం | Hafeez banned from bowling for 12 months | Sakshi
Sakshi News home page

బౌలింగ్ పరీక్షలో హఫీజ్ మళ్లీ విఫలం

Published Sat, Jul 18 2015 12:35 AM | Last Updated on Sat, Mar 23 2019 8:23 PM

బౌలింగ్ పరీక్షలో హఫీజ్ మళ్లీ విఫలం - Sakshi

బౌలింగ్ పరీక్షలో హఫీజ్ మళ్లీ విఫలం

ఏడాది నిషేధం
 కరాచీ: పాకిస్తాన్ క్రికెట్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆల్‌రౌండర్ మహ్మద్ హఫీజ్ రెం డోసారి బౌలింగ్ పరీక్ష (బయోమెకానికల్ టెస్టు)లో విఫలమయ్యాడు. దీంతో అతనిపై ఐసీసీ ఏడాది పాటు బౌలింగ్ చేయకుండా నిషేధం విధించింది. ఈనెల 6న చెన్నైలోని రామచంద్ర యూనివర్సిటీలో నిర్వహించిన బయోమెకానికల్ పరీక్షలో హఫీజ్ మోచేతిని 15 డిగ్రీల కంటే ఎక్కువగా వంచుతున్నట్లు గుర్తించారు.
 
 బౌలింగ్ నిబంధనల ప్రకా రం మోచేతిని 15 డిగ్రీల కంటే ఎక్కువగా వంచకూడదు. దీంతో అతని బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు అనుగుణంగా లేదని తేల్చారు. హఫీజ్ పరీక్షలో విఫలం కావడం తమ భవిష్యత్ ప్రణాళికలను దెబ్బతీసిందని పాకిస్తాన్ చీఫ్ సెలక్టర్ హరూన్ రషీద్ అన్నారు. ‘మా వ్యూహాల్లో హఫీజ్ బౌలింగ్ చాలా కీలకం. 12 నెలల నిషేధం పడింది కాబట్టి మా వ్యూహాలను పునరాలోచించుకోవాలి’ అని రషీద్ పేర్కొన్నారు. బ్యాట్స్‌మన్‌గా హఫీజ్ జట్టులో కొనసాగే అవకాశం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement