దక్షిణాఫ్రికా ప్రధాన పేసర్ డేల్ స్టెయిన్‌ను సమర్థంగా ఎదుర్కోగలిగితే టెస్టు సిరీస్‌లో భారత్‌కు విజయావకాశాలు ఉంటాయని టీమిండియా మాజీ బౌలింగ్ కోచ్ ఎరిక్ సిమన్స్ అభిప్రాయ పడ్డారు.
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా ప్రధాన పేసర్ డేల్ స్టెయిన్‌ను సమర్థంగా ఎదుర్కోగలిగితే టెస్టు సిరీస్‌లో భారత్‌కు విజయావకాశాలు ఉంటాయని టీమిండియా మాజీ బౌలింగ్ కోచ్ ఎరిక్ సిమన్స్ అభిప్రాయ పడ్డారు. ‘భారత బ్యాట్స్‌మెన్ స్టెయిన్‌ను ఎలా ఆడతారన్నదే సిరీస్‌లో కీలకం. అతని మెరుపు బౌలింగ్‌ను నిలువరించారంటే మానసికంగా పైచేయి సాధించగలరు. అప్పుడు స్వేచ్ఛగా ఆడగలరు’ అని దక్షిణాఫ్రికాకు చెందిన సిమన్స్ వ్యాఖ్యానించారు.
పిచ్‌లపై బౌన్స్ కారణంగా ఇక్కడి వికెట్లపై ఫుల్ లెంగ్త్ బంతులు వేయాల్సి ఉంటుందనే విషయాన్ని భారత పేసర్లు గుర్తించాలని ఆయన అన్నారు. జహీర్‌ఖాన్ అందుబాటులో ఉండటం కెప్టెన్‌గా ధోనికి మేలు చేస్తుందన్న సిమన్స్, షమీ బౌలింగ్ తనను ఎంతో ఆకట్టుకుందని ప్రశంసించారు. ప్రత్యర్థి జట్టు 20 వికెట్లను పడగొట్టగల సత్తా భారత్‌కు ఉందన్నారు.