న్యూఢిల్లీ: వెస్టిండీస్‌తో టీమిండియా తలపడనున్న రెండు టెస్టుల సిరీస్‌కు ఓపెనర్ రోహిత్ శర్మను ఎంపిక చేయకపోవడాన్ని మాజీ ఆటగాళ్లు దగ్గర్నుంచి, సీనియర్ ఆటగాళ్ల సైతం తప్పుబడుతున్నారు. ఇప్పటికే విండీస్‌తో టెస్టు సిరీస్‌కు రోహిత్‌ను ఎంపిక చేయకపోవడాన్ని సౌరవ్ గంగూలీ ప్రశ్నించగా, తాజాగా హర్భజన్ సింగ్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ మేరకు ట్వీటర్ స్పందించిన భజ్జీ.. ‘వెస్టిండీస్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌లో భాగంగా భారత జట్టులో రోహిత్ శర్మను పరిగణలోకి తీసుకోలేదు. అసలు సెలక్టర్ల ఆలోచనా విధానం ఏమిటో అర్థం కావడం లేదు. ఎవరికైనా తెలిస్తే చెప్పండి.. రోహిత్‌ను ఎందుకు ఎంపిక చేయలేదు తెలుసుకోవాలని ఉంది. దీన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నా’ అని పేర్కొన్నాడు.
మరొకవైపు రోహిత్‌ను పక్కక పెట్టడంపై అభిమానులు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. ‘దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో రోహిత్ విఫలమయ్యాడనే కారణంతో విండీస్‌తో సిరీస్‌కు అతన్ని ఎంపిక చేయలేదు. అదే సమయంలో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ పర్యటనల్లో విఫలమైన కేఎల్ రాహుల్, పుజారాలను మళ్లీ ఎందుకు ఎంపిక చేశారు’ అని ఒక అభిమాని ప్రశ్నించగా, ఇటీవల జరిగిన ఆసియాకప్‌లో భాగంగా పాకిస్తాన్ జరిగిన సూపర్-4 స్టేజ్ మ్యాచ్‌లో రోహిత్ తన శైలికి భిన‍్నంగా ఆడాడు. టెస్టుల్లో ఎలా ఆడాలో అదే తరహాలో రోహిత్ ఆట సాగింది. మరి ఆసియాకప్‌లో భారత జట్టు విజేతగా నిలిచింది కదా. అటువంటప్పుడు రోహిత్‌ను ఎందుకు ఎంపిక చేయలేదో తెలియడం లేదు’ అని మరొకరు ట్వీట్ చేశారు. ‘ రోహిత్‌ను విండీస్‌తో టెస్టు సిరీస్‌కు ఎందుకు ఎంపిక చేయలేదు. క్రికెట్‌లో రాజకీయాల్ని చేర్చకండి. రోహిత్‌ను జట్టులోకి తీసుకోవడంపై సమాధానం చెప్పండి’ మరొకరు నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment