
డ్వేన్ స్మిత్ ఔట్.. మైక్ హస్సీ ఇన్
ఐపీఎల్ - 8 లో భాగంగా శనివారం ఇక్కడి పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడుతున్నాయి.
మొహాలీ: ఐపీఎల్ - 8 లో భాగంగా శనివారం ఇక్కడి పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. చెన్నై జట్టులో స్వల్ప మార్పులు జరిగాయి. డాషింగ్ ఓపెనర్ డ్వేన్ స్మిత్ ను చెన్నై సూపర్ కింగ్స్ పక్కనపెట్టింది. లీగ్ దశ చివరి మ్యాచ్ లో అతడి స్థానంలో మైకెల్ హస్సీ చెన్నై జట్టులో స్థానం సంపాదించాడు.