ఖమ్మం స్పోర్ట్స్, న్యూస్‌లైన్: జాతీయ బాల్ బ్యాడ్మింటన్‌లో హైదరాబాద్ పురుషుల జట్టు టైటిల్ సాధించింది. ఖమ్మంలో ఐదు రోజుల పాటు జరిగిన ఈ టోర్నీలో మహిళల విభాగంలో తమిళనాడు జట్టు విజయం సాధించింది.
పురుషుల విభాగం ఫైనల్లో హైదరాబాద్ జట్టు 29-25, 29-20తో ఇండియన్ రైల్వేస్ జట్టుపై నెగ్గింది. మహిళల ఫైనల్లో తమిళనాడు జట్టు 29-24, 29-17తో కర్ణాటకపై గెలిచింది. పురుషుల విభాగంలో ఆంధ్ర, తమిళనాడు... మహిళల విభాగంలో కేరళ, ఆంధ్ర వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి.
విజేత హైదరాబాద్
Published Thu, Jan 16 2014 1:33 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement