'పద్మ భూషణ్' ను గౌరవంగా భావిస్తున్నా: సానియా | I feel very honoured and privileged on being accorded pada bhushan: Sania Mirza | Sakshi
Sakshi News home page

'పద్మ భూషణ్' ను గౌరవంగా భావిస్తున్నా: సానియా

Published Sun, Jan 31 2016 5:38 PM | Last Updated on Sun, Sep 3 2017 4:42 PM

'పద్మ భూషణ్' ను గౌరవంగా భావిస్తున్నా: సానియా

'పద్మ భూషణ్' ను గౌరవంగా భావిస్తున్నా: సానియా

హైదరాబాద్: ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్స్ ను తన ఖాతాలో వేసుకున్న భారత టెన్నిస్ స్టార్, టాప్ సీడ్ సానియా మీర్జా ఆదివారం హైదరాబాద్కు చేరుకుంది. ఈ సందర్భంగా సానియాను స్థానిక మీడియా పలకరించింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో మూడోదైన ‘పద్మ భూషణ్’ను సానియాకు  ఫ్రకటించిన సంగతి తెలిసిందే.

దీనిపై స్పందించిన సానియా.. పద్మ భూషణ్ లభించడం నాకు ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. భవిష్యత్ లో మరిన్ని గొప్ప విజయాలు సాధించేందుకు ఈ పురస్కారం ప్రేరణగా నిలుస్తుందని సానియా అభిప్రాయపడింది. ఒకవైపు మహిళల డబుల్స్ టైటిల్, మరొవైపు పద్మ భూషణ్ సత్కారం.. తనకు లభించడం చాలా సంతోషాన్ని కలిగించిందంటూ సానియా మీర్జా తన మనసులోని అభిప్రాయాన్ని వెలిబుచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement