Virat kohli: I've Never Been More Proud & Happy of a Team than This | India Vs Australia Test Series 2018 - Sakshi
Sakshi News home page

ఇంత గొప్పగా ఎప్పుడూ ఫీల్‌ కాలేదు: కోహ్లి

Published Mon, Jan 7 2019 11:57 AM | Last Updated on Mon, Jan 7 2019 12:41 PM

I never been more proud of a team than this one, Kohli - Sakshi

సిడ్నీ: ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్‌ను గెలవడంపై టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి హర్షం వ్యక్తం చేశాడు. ఇదొక మధురమైన జ్ఞాపకంగా పేర్కొన్న కోహ్లి.. తాము అన్ని విభాగాల్లోనూ సమష్టిగా రాణించడంతోనే ఆసీస్‌ను వారి దేశంలో ఓడించామన్నాడు. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా చివరి టెస్టు డ్రాగా ముగియడంతో కోహ్లి సేన సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. దీనిలో భాగంగా మాట్లాడిన కోహ్లి.. ‘ప్రస్తుత జట్టును చూసి చాలా గర్వంగా ఉంది. ఈ సిరీస్‌ను సాధించడం నిజంగా చాలా గొప్పగా ఫీల్‌ అవుతున్నా. గత 12 నెలల నుంచి మా జట్టు అద్భుతమైన విజయాలు సాధిస్తూ చక‍్కటి పునాది వేసుకుంది. ఏడాది కాలంగా జట్టులో వచ్చిన సమతుల్యతోనే ఆసీస్‌ను వారి గడ్డపై ఓడించాం. అంతకుముందు జరిగిన రెండు విదేశీ పర‍్యటనల్లో కూడా మా జట్టు సత్తా చాటింది. భారత క్రికెట్‌ జట్టు ఈ స్థాయి ప్రదర్శనను నేను ఎప్పుడూ చూడలేదు. నలుగురు పేసర్లతో విదేశీ పర్యటనకు వెళ్లడం కూడా నా అనుభవంలో ఎదురుకాలేదు. ఇది జట్టు సభ్యులందరూ సాధించిన అద్భుతమైన ఘనత.  ప్రధానంగా ఫిట్‌నెస్‌ స్థాయిని కాపాడుకోవడం వల్లే ఆసీస్‌లో విజయాలు సాధించాం. దీనికి జట్టు సభ్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. హ్యాట్సాఫ్‌ టు టీమ్‌ మెంబర్స్‌. మన తలంపు ఎప్పుడైతే సరైన రీతిలో ఉంటుందో అప్పుడు అద్భుతమైన ఫలితాలు సాధిస్తాం. భారత క్రికెట్‌ను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడమే మా ముందున్న లక్ష్యం’ అని కోహ్లి అన‍్నాడు.

అదే సమయంలో భారత్‌ వరల్డ్‌కప్‌ సాధించిన క్షణాల్ని కూడా కోహ్లి ఒకసారి నెమరవేసుకున్నాడు. 2011 వరల్డ్‌కప్‌ సాధించిన భారత జట్టులో తాను జట్టు సభ్యుడినని పేర్కొన్న కోహ్లి.. అదొక చిరస్మరణీయమైన జ్ఞాపకంగా పేర్కొన్నాడు. కాకపోతే ఆ సమయంలో తానొక యువ క్రికెటర్‌ను మాత్రమేనని, ఆ వరల్డ్‌కప్‌ గెలిచిన ఆనంద క్షణాల్ని జట్టు సభ్యులు ఆస్వాదించడాన్ని స్వయంగా చూశానన్నాడు. కానీ వారు ఎలా ఫీలయ్యారో తనకు అప్పుడు తెలియదన్న కోహ్లి.. ఇప్పుడు కెప్టెన్‌గా చారిత్రక సిరీస్‌ను గెలిచిన సందర్భాన్ని విపరీతంగా ఎంజాయ్‌ చేస్తున్నానన్నాడు. ఇంత గొప‍్పగా తాను ఎప్పుడూ ఫీల్‌ కాలేదని కోహ్లి తెలిపాడు. తాము ఏదైతే వ్యూహంతో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లామో దాన్ని కచ్చితంగా అమలు చేసి సక‍్సెస్‌ అయ్యామన్నాడు. ప్రధానంగా తమ బ్యాటింగ్ విభాగానికి బౌలర్ల జోష్‌ కూడా తోడవడంతో విజయం సునాయాసమైందన్నాడు. ప్రతీ ఒక బౌలర్‌ తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదని కోహ్లి ప్రశంసలు కురిపించాడు.

చరిత్ర సృష్టించిన కోహ్లి సేన

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement