అనుష్కతో కలిసి కోహ్లి విక్టరీ వాక్‌ | Virat Kohlis Victory Walk With Wife Anushka Sharma At Sydney | Sakshi
Sakshi News home page

అనుష్కతో కలిసి కోహ్లి విక్టరీ వాక్‌

Published Mon, Jan 7 2019 1:59 PM | Last Updated on Mon, Jan 7 2019 2:05 PM

Virat Kohlis Victory Walk With Wife Anushka Sharma At Sydney - Sakshi

సిడ్నీ: ఆస్ట్రేలియాలో తొలిసారి చారిత్రక టెస్టు సిరీస్‌ను టీమిండియా సాధించిన తరుణంలో జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.. భార్య అనుష్క శర్మతో కలిసి గ్రౌండ్‌లో సందడి చేశాడు. చివరి టెస్టు డ్రాగా ముగిసిన నేపథ్యంలో సిరీస్‌ భారత్‌ వశమైంది. ఈ సిరీస్‌ విజయాన్ని అనుష్కతో కలిసి పంచుకున్నాడు కోహ్లి. సిడ‍్నీ గ్రౌండ్‌లో భార్య అనుష్కతో కలిసి సెలబ్రేట్‌ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ అయ్యింది.

నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన చివరి టెస్టు డ్రాగా ముగియడంతో గావస్కర్‌ - బోర్డర్‌ ట్రోఫీని భారత్‌ 2-1తో సొంతం చేసుకుంది. ఫలితంగా 72 ఏళ్ల చిరకాల స్వప్నాన్ని, గతంలో దిగ్గజాలకు కూడా సాధ్యం కాని ఘనతను కోహ్లి సేన సాకారం చేసింది.

ఈ మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ వర్షం పదే పదే కురువడంతో పూర్తి ఆట సాధ్యం కాలేదు. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 622/7 డిక్లేర్‌ చేయగా, ఆసీస్‌ తన మొదటి ఇన్నింగ్స్‌లో 300 పరుగులకు ఆలౌటైంది. ఈ క్రమంలోనే ఆసీస్‌ ఫాలో ఆన్‌ ఆడాల్సి వచ్చింది. కాగా, ఆదివారం నాల్గో రోజు ఆటలో ఆసీస్‌ వికెట్‌ కోల్పోకుండా ఆరు పరుగుల వద్ద ఉన్న సమయంలో వర్షం పడింది. చివరి రోజు ఆటకు సైతం వరుణుడు అడ్డుపడటంతో ఒక్క బంతి కూడా పడలేదు. దాంతో మ్యాచ్‌ ఫలితం తేలకుండానే ముగిసింది. భారీ శతకం సాధించిన పుజారా(193) మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డుతో పాటు మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు అందుకున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement