ఆసీస్ జెర్సీని ధరిస్తా: గంగూలీ
లండన్: భారత క్రికెట్ జట్టు చరిత్రలో మాజీ సారథి సౌరవ్ గంగూలీది ప్రత్యేక స్థానం. భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించినంత కాలం దూకుడే అతని సూత్రం. అదే టీమిండియా క్రికెట్ ను ఉన్నతిస్థానంలో నిలబెట్టిందనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే గంగూలీ క్రీడా కెరీర్కు గుడ్ బై చాలా కాలం అయినప్పటికీ అతనిలో దూకుడు మాత్రం ఏ మాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించాడు. తాజాగా ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు షేన్ వార్న్తో బెట్టకట్టడమే ఇందుకు ఉదాహరణ.
అసలు ఏమి జరిగిందంటే.. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా 'ఆజ్ తక్ క్రికెట్ సలామ్' కార్యక్రమంలో వ్యాఖ్యాతలుగా గంగూలీతో పాటు ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు వార్నర్, మైకేల్ క్లార్క్లు పాల్గొన్నారు. దానిలో భాగంగా జూన్18 వ తేదీన జరిగే ఫైనల్ మ్యాచ్లో రెండు పటిష్టమైన జట్టు ఆస్ట్రేలియా-భారత్లు తలపడతాయంటూ క్లార్క్ తన అభిప్రాయాన్ని తెలిపాడు. అయితే దీంతో గంగూలీ విభేదించాడు. ఫైనల్ తలపడే జట్టు భారత్-ఇంగ్లండ్లు అంటూ గంగూలీ జోస్యం చెప్పాడు. దాంతో కాసింత అసహనానికి లోనైన క్లార్.. ఇంగ్లండ్ జట్టులో మ్యాచ్ విన్నర్లు ఎవరున్నారంటూ గంగూలీని ప్రశ్నించాడు. ఇంగ్లండ్ జట్టులో జో రూట్, బట్లర్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారని, ఆస్ట్రేలియా కంటే ఇంగ్లండ్ జట్టే అన్ని విభాగాల్లో ఉందంటూ గంగూలీ ఎటువంటి మొహం లేకుండా చెప్పేశాడు.
ఇది షేన్ వార్న్కు ఎంతమాత్రం రుచించలేదు. గ్రూప్-ఎ మ్యాచ్లో జూన్ 10 వ తేదీన ఆస్ట్రేలియా-ఇంగ్లండ్లు తలపడుతున్నాయి కదా. ఇక్కడ ఆసీస్ గెలుస్తుందనేది తన బెట్ అంటూ వార్న్ సవాల్ విసిరాడు.ఆ మ్యాచ్లో ఆసీస్ గెలిస్తే గంగూలీ తమ జట్టు జెర్సీ ధరించాలంటూ వార్న్ ఛాలెంజ్ చేశాడు. దీనికి గంగూలీ ముందుకొచ్చాడు. ఆ మ్యాచ్ లో ఆసీస్ గెలిచిన పక్షంలో వారి జెర్సీని ధరిస్తానని ఆ సవాల్ ను స్వీకరించాడు. అదే సమయంలో అక్కడ ఇంగ్లండ్ గెలిస్తే తాను ఆ జట్టు జెర్సీని వార్నర్ ధరించాల్సి ఉంది. మరి చూద్దాం ఏ జట్టు జెర్సీని ఎవరు ధరిస్తారో చూడాలి.