ఖలీల్ అజేయ శతకం | ibrahim khalil century | Sakshi
Sakshi News home page

ఖలీల్ అజేయ శతకం

Published Thu, Jul 17 2014 1:36 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

ఖలీల్ అజేయ శతకం - Sakshi

ఖలీల్ అజేయ శతకం

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రంజీ జట్టు మాజీ వికెట్ కీపర్ ఇబ్రహీం ఖలీల్ (281 బంతుల్లో 152 నాటౌట్, 12 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీతో కదంతొక్కడంతో ఎన్స్‌కాన్స్ భారీ స్కోరు చేసింది. ఎ1-డివిజన్ మూడు రోజుల లీగ్‌లో దక్షిణమధ్య రైల్వే  జట్టుతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బుధవారం రెండో రోజు ఆటలో ఎన్స్‌కాన్స్ 440/8 స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
 
  రేయాన్ అమూరి 43 పరుగులు చేయగా, బాషా 4 వికెట్లు తీశాడు. అనంతరం రైల్వే జట్టు ఆటముగిసే సమయానికి 2 వికెట్లకు 45 పరుగులు చేసింది. మరో మ్యాచ్‌లో  ఎస్‌బీహెచ్ బౌలర్లు రవికిరణ్ (5/90), అశ్విన్ యాదవ్ (4/100) విజృంభించడంతో ఈఎంసీసీ తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ నిఖిల్ యాదవ్ (149 బంతుల్లో 120 నాటౌట్, 19 ఫోర్లు) సెంచరీ సాధించాడు. తర్వాత బ్యాటింగ్ మొదలుపెట్టిన ఎస్‌బీహెచ్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. ఆకాశ్ భండారి (75), సుమంత్ (64) అర్ధసెంచరీలు చేశారు.
 
 ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
 ఆంధ్రాబ్యాంక్ తొలి ఇన్నింగ్స్: 423/5 డిక్లేర్డ్ (రవితేజ 193, నవీన్ రెడ్డి 152 నాటౌట్; పర్వేజ్ ఖాన్ 4/81), కేంబ్రిడ్జ్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 175 (అజ్మత్‌ఖాన్ 38, తనయ్ త్యాగరాజన్ 32; ఖాదర్ 4/36, కనిష్క్‌నాయుడు 3/43), రెండో ఇన్నింగ్స్: 1/0.  కాంటినెంటల్ తొలి ఇన్నింగ్స్: 394 (శాండిల్య 159, చైతన్యకృష్ణ 96, ఆరోన్ పాల్ 37; శివశంకర్ 4/77) బీడీఎల్ తొలి ఇన్నింగ్స్: 82/2.
 
 డెక్కన్ క్రానికల్ తొలి ఇన్నింగ్స్: 359 (అక్షత్ రెడ్డి 119, షాదాబ్ తుంబి 72, హబీబ్ అహ్మద్ 50, ప్రణీత్ 40; మోహిత్ మన్ 4/39, దివేశ్ పథానియా 4/112), ఏఓసీ తొలి ఇన్నింగ్స్: 81/1.
 
 శ్రీదరహాస్‌కు 5 వికెట్లు
 శ్రీదరహాస్ (5/38) నిప్పులు చెరగడంతో ఆర్.దయానంద్ జట్టు తక్కువ స్కోరుతోనే తొలి ఇన్నింగ్స్‌లో 47 పరుగుల ఆధిక్యం సంపాదించింది. మొదట దయానంద్ తొలి ఇన్నింగ్స్‌లో 208 పరుగులకే ఆలౌటైంది. తర్వాత ఫలక్‌నుమా జట్టు 161 పరుగులకే కుప్పకూలింది. ఇంద్రశేఖర్ రెడ్డి 3 వికెట్లు తీశాడు. తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో దయానంద్ జట్టు 3 వికెట్లకు 27 పరుగులు చేసింది.
 
 చెలరేగిన అన్వర్
 హైదరాబాద్ బాట్లింగ్ బౌలర్ అన్వర్ అహ్మద్‌ఖాన్ (5/37) చెలరేగడంతో ఎంపీ కోల్ట్స్ తొలి ఇన్నింగ్స్‌లో 133 పరుగులకే కుప్పకూలింది. తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన బాట్లింగ్ జట్టు 4 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. వంశీవర్ధన్ రెడ్డి (144 బంతుల్లో 77 బ్యాటింగ్, 10 ఫోర్లు), షేక్ మహమ్మద్ (128 బంతుల్లో 53, 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీలు సాధించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement