'టీమిండియా కోచ్గా దాదాయే బెస్ట్' | Ideal Time to Coach Team India, Sourav Ganguly a Good Option: Sunil Gavaskar | Sakshi
Sakshi News home page

'టీమిండియా కోచ్గా దాదాయే బెస్ట్'

Published Tue, May 19 2015 8:47 AM | Last Updated on Sun, Sep 3 2017 2:19 AM

'టీమిండియా కోచ్గా దాదాయే బెస్ట్'

'టీమిండియా కోచ్గా దాదాయే బెస్ట్'

న్యూఢిల్లీ: టీమిండియాకు మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అనుభవం ఎంతో ఉపయోగపడుతుందని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. భారత జట్టు హెడ్ కోచ్గా లేదా టీమ్ డైరెక్టర్గా ఏ పదవిలో నియమించినా గంగూలీ పూర్తి న్యాయం చేస్తాడని అభిప్రాయపడ్డాడు.

డంకెన్ ఫ్లెచర్ స్థానంలో కొత్త కోచ్ను నియమించేందుకు బీసీసీఐ అన్వేషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పదవికి గంగూలీ సహా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. టీమిండియా కోచ్ పదవికి గంగూలీయే ఉత్తమని గవాస్కర్ అన్నాడు. 'భారత్ ఆడబోయే మ్యాచ్లు ఎక్కువగా స్వదేశంలో, ఉపఖండంలో ఉన్నాయి. టీమిండియా కోచ్ బాధ్యతలు చేపట్టేందుకు ఇదే సరైన సమయం. ఈ పదవిలో గంగూలీని నియమిస్తే జట్టును సమర్థవంతంగా నడిపిస్తాడు. దాదా కోచ్ అయితే జట్టుకు ఇతర కోచ్ల అవసరం ఉండదు' అని గవాస్కర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. టీమిండియా కోచ్ పదవికి ఇటీవల దాదా పేరు వినిపిస్తున్నా.. ఆయన తన అభిప్రాయాన్నివెల్లడించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement