తొలి బంతినే సిక్సర్ బాదేస్తా
న్యూఢిల్లీ: తానాడే తొలిబంతిని సిక్సర్ కొట్టవచ్చని భావిస్తే, అదే పని చేస్తానని బ్యాటింగ్ సంచలనం రిషబ్ పంత్ అన్నాడు. తొలిబంతి అయినా చెత్తగా వేస్తే దాన్ని వదలిపెట్టరాదని, షాట్ కొట్టాల్సిందేనని చెప్పాడు. గుజరాత్ లయన్స్‌తో మ్యాచ్‌లో పంత్ (43 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 97) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో ఢిల్లీ డేర్‌డెవిల్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో పంత్ ఆడిన రెండో బంతినే సిక్సర్ బాదాడు. ఈ విషయం గురించి ఆతను మాట్లాడుతూ.. 'షాట్ కొట్టాల్సిన బాల్ అయితే వదిలిపెట్టను. చెత్తబంతి వేస్తే దాన్ని బాదాల్సిందే. ఎక్కువగా ఆలోచించకుండా సహజశైలిలో ఆడాల్సిందిగా రాహుల్ ద్రావిడ్ చెప్పాడు' అని అన్నాడు. కాగా మూడు పరుగుల తేడాతో సెంచరీ మిస్సవడంపై పంత్ మాట్లాడుతూ.. తాను విషయం గురించి ఆలోచించలేదని, వీలైనంత త్వరగా లక్ష్యాన్ని ఛేదించి జట్టును గెలిపించడం గురించే ఆలోచించానని చెప్పాడు.