రాజ్‌కోట్: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డే అనంతరం టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. జట్టుకు అవసరమైన సమయంలో ఏ పాత్ర పోషించడానికైనా సిద్దపడిన రాహుల్ గట్స్‌కు హ్యాట్సాఫ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. తొలి వన్డేలో రిషభ్ పంత్ తలకు గాయం కావడంతో రెండో వన్డేలో రాహుల్ అదనపు కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించాడు. అదేవిధంగా స్వతహగా టాపార్డర్ బ్యాట్స్‌మన్ అయిన రాహుల్ రాజ్‌కోట్ వన్డేల్లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి జట్టుకు అవసరమైన అమూల్యమైన పరుగులు జోడించాడు. రాహుల్ చివర్లో రాబట్టిన 80 పరుగులే టీమిండియా విజయానికి కీలకంగా మారాయి. అంతేకాకుండా కీపింగ్‌లోనూ రాహుల్ అదరగొట్టాడు. ఆసీస్ సారథి ఆరోన్ ఫించ్‌ను స్టంపౌట్ చేయడంతో పాటు మరో రెండు క్యాచ్‌లను అందుకున్నాడు. ఈ క్రమంలో యువ సంచలనం రిషభ్ పంత్‌ను శిఖర్ ధావన్‌ను ట్రోల్ చేశాడు.
మ్యాచ్ అనంతరం చహల్ టీవీకి ధావన్, రాహుల్‌లు ఇంటర్వ్యూ ఇచ్చిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా రాహుల్ కీపింగ్‌ను ధావన్ మెచ్చుకున్నాడు. అంతేకాకుండా పంత్‌పై ఫన్నీ కామెంట్ చేశాడు. ‘పంత్ నీ(రాహుల్) కీపింగ్ చూశాక అతడు కూడా నీలా ఫ్లిఫ్స్ వేయడానికి ప్రయత్నిస్తాడు. ఆ తర్వాత నిల్చొని అయామ్ ఫైన్ అని చెప్తాడు’ అంటూ ధావన్ సరదాగా పేర్కొన్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇక నిర్ణయాత్మకమైన మూడో వన్డేకు విన్నింగ్ టీమ్‌నే కొనసాగించాలని టీమిండియా భావిస్తే పంత్‌కు అవకాశం లేనట్లే. అంతేకాకుండా పంత్, ధావన్ గాయంపై కూడా బీసీసీఐ ఇప్పటివరకు స్పష్టతనివ్వలేదు. అయితే రోహిత్‌కు తగిలిన గాయం పెద్దదేమి కాదని చివరి వన్డేలో తప్పక ఆడతాడని బీసీసీఐ స్పష్టం చేసింది.
WATCH: @SDhawan25 takes over Chahal TV as he recaps #TeamIndia’s win with @klrahul11 😎 - by @28anand #INDvAUS
— BCCI (@BCCI) January 18, 2020
Full video here 📽️👉 https://t.co/YX9p4YiQ4X pic.twitter.com/DSvRON1ez8
చదవండి:
వారి వీడియోలో చూసేవాడ్ని
పంత్ పరిస్థితి ఏమిటి?
Comments
Please login to add a commentAdd a comment