క్లీన్ స్వీప్...
చివరి టెస్టులో 321 పరుగులతో ఘనవిజయం
అశ్విన్‌కు 7 వికెట్లు
మ్యాచ్ వేదిక, తేదీలు మారారుు తప్ప ఫలితంలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. ఊహించినట్లుగానే న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో భారత్ సంపూర్ణ ఆధిపత్యం కొనసాగింది. ఎలాంటి ప్రతిఘటన, పోరాటం లేకుండా నాలుగో రోజే కివీస్ తలవంచడంతో చివరి టెస్టులో అద్భుత విజయం అందుకున్న భారత్ 3-0తో సిరీస్‌ను ముగించింది. మరోసారి బౌలింగ్‌లో సింహస్వప్నంగా మారిన అశ్విన్ ఏడు వికెట్లతో ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు.
ఇండోర్: సొంతగడ్డపై భారత్ మరో అలవోక టెస్టు సిరీస్ విజయాన్ని అందుకుంది. ఇక్కడి హోల్కర్ స్టేడియంలో మంగళవారం ముగిసిన మూడో టెస్టులో భారత్ 321 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించింది. ఫలితంగా మూడు టెస్టుల సిరీస్‌ను 3-0తో గెలుచుకుంది. 475 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 44.5 ఓవర్లలో 153 పరుగులకే కుప్పకూలింది. ఏ ఒక్క బ్యాట్స్‌మన్ కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చలేదు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అశ్విన్ (7/59) తన కెరీర్ అత్యుత్తమ గణాంకాలతో భారత్‌ను గెలిపించాడు. ఈ టెస్టులో అతను మొత్తం 13 వికెట్లు తీశాడు. నాలుగో రోజు మంగళవారం ఆటలో టీ విరామ సమయానికి 38/1తో ఉన్న కివీస్, ఆ తర్వాత అశ్విన్ దెబ్బకు ఒకే సెషన్‌లో 9 వికెట్లు కోల్పోరుుంది.అంతకుముందు భారత్ తమ రెండో ఇన్నింగ్‌సను 3 వికెట్ల నష్టానికి 216 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. పుజారా (148 బంతుల్లో 101 నాటౌట్; 9 ఫోర్లు) కెరీర్‌లో ఎనిమిదో సెంచరీ సాధించగా, గంభీర్ (56 బంతుల్లో 50; 6 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. ఇరు జట్ల మధ్య ఆదివారం నుంచి వన్డే సిరీస్ జరుగుతుంది. పరుగులపరంగా (321) భారత్‌కు ఇది రెండో అతి పెద్ద విజయం కాగా మన జట్టు మూడుకంటే ఎక్కువ టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం ఇది నాలుగోసారి. గతంలో ఇంగ్లండ్ (1993లో), శ్రీలంక (1994లో), ఆస్ట్రేలియా (2013లో)లపై భారత్ ఇలాంటి విజయం అందుకుంది.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్‌స 557/5 డిక్లేర్డ్, న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్‌స 299, భారత్ రెండో ఇన్నింగ్‌స: 216/3 డిక్లేర్డ్, న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్‌స: లాథమ్ (ఎల్బీ) (బి) ఉమేశ్ 6; గప్టిల్ (ఎల్బీ) (బి) జడేజా 29; విలియమ్సన్ (ఎల్బీ) (బి) అశ్విన్ 27; రాస్ టేలర్ (బి) అశ్విన్ 32; రోంచీ (బి) అశ్విన్ 15; నీషమ్ (సి) కోహ్లి (బి) జడేజా 0; వాట్లింగ్ (నాటౌట్) 23; సాన్‌ట్నర్ (బి) అశ్విన్ 14; పటేల్ (బి) అశ్విన్ 0; హెన్రీ (సి) షమీ (బి) అశ్విన్ 0; బౌల్ట్ (సి) అండ్ (బి) అశ్విన్ 4; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (44.5 ఓవర్లలో ఆలౌట్) 153.
వికెట్ల పతనం: 1-7; 2-42; 3-80; 4-102; 5-103; 6-112; 7-136; 8-138; 9-138; 10-153.
బౌలింగ్: షమీ 7-0-34-0; ఉమేశ్ 8-4-13-1; అశ్విన్ 13.5-2-59-7; జడేజా 16-3-45-2.