రోహిత్ పెళ్లికొడుకాయెనే... | india cricketer rohith sharma marriage | Sakshi
Sakshi News home page

రోహిత్ పెళ్లికొడుకాయెనే...

Published Mon, Dec 14 2015 1:59 AM | Last Updated on Sun, Sep 3 2017 1:57 PM

రోహిత్ పెళ్లికొడుకాయెనే...

రోహిత్ పెళ్లికొడుకాయెనే...

భారత క్రికెటర్ రోహిత్ శర్మ ఒక ఇంటివాడయ్యాడు. తన చిరకాల స్నేహితురాలు రితిక సజ్దేను ఆదివారం అతను వివాహమాడాడు. ముంబైలోని ఒక స్టార్ హోటల్‌లో అట్టహాసంగా జరిగిన ఈ పెళ్లికి పలువురు భారత క్రికెటర్లు, సినీ తారలతో పాటు రోహిత్ మిత్రులు, సన్నిహితులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సచిన్ టెండూల్కర్, అజింక్య రహానే, శిఖర్ ధావన్, చతేశ్వర్  పుజారా, రవీంద్ర జడేజా, ఉమేశ్ యాదవ్, సురేశ్ రైనా తదితరులు పెళ్లికి వచ్చారు.

యువరాజ్, సురేశ్ రైనా కూడా విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లకు విరామం ఇచ్చి సహచరుడు వివాహ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెళ్లికి రెండు రోజుల ముందు శుక్రవారం రాత్రి రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తమ ముంబై జట్టు కెప్టెన్ అయిన రోహిత్ శర్మ దంపతుల కోసం ప్రత్యేకంగా ఇచ్చిన పార్టీకి కూడా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement