Ritika sajde
-
భార్యకు రోహిత్ శర్మ బర్త్ డే విషెస్.. పోస్ట్ వైరల్
-
రోహిత్ శర్మ,రితిక వెడ్డింగ్ యానివర్సరీ (ఫొటోలు)
-
ఐపీల్ కప్పుతో తిరిగొస్తా... కూతురికి మాటిచ్చిన రోహిత్ శర్మ
-
రోహిత్ శర్మ పుత్రికోత్సాహం
టీమిండియా ఆటగాడు, హిట్మాన్ రోహిత్ శర్మ పుత్రికోత్సాహంతో పొంగిపోతున్నాడు. ఆటకు కాస్త విరామం ఇచ్చి కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. రోహిత్ భార్య రితిక ఆదివారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తల్లిదండ్రులుగా మారిన తర్వాత తమ చిన్నారితో కలిసి మధుర క్షణాలను ఆస్వాదిస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రోహిత్... ‘హెలో వరల్డ్.. 2019 మనందరికీ బాగుండాలి’ అని ట్వీట్ చేశాడు. ఈ ఫొటోపై లైకుల వర్షం కురిపిస్తున్న రోహిత్ అభిమానులు.. ‘భయ్యా మీ పాపాయికి రోహిక అనే పేరు పెడితే బాగుంటుంది’ అంటూ సలహాలు కూడా ఇస్తున్నారు. కాగా కూతురిని చూసేందుకు భారత్కు వచ్చిన రోహిత్.. ఈ కారణంగా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్లో భాగంగా చివరిదైన నాల్గో టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఇక మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం ఈ నెల 8న అతడు తిరిగి జట్టుతో చేరతాడు. Well hello world! Let’s all have a great 2019 😉 pic.twitter.com/N1eJ2lHs8A — Rohit Sharma (@ImRo45) January 3, 2019 -
రోహిత్ పెళ్లికొడుకాయెనే...
-
రోహిత్ పెళ్లికొడుకాయెనే...
భారత క్రికెటర్ రోహిత్ శర్మ ఒక ఇంటివాడయ్యాడు. తన చిరకాల స్నేహితురాలు రితిక సజ్దేను ఆదివారం అతను వివాహమాడాడు. ముంబైలోని ఒక స్టార్ హోటల్లో అట్టహాసంగా జరిగిన ఈ పెళ్లికి పలువురు భారత క్రికెటర్లు, సినీ తారలతో పాటు రోహిత్ మిత్రులు, సన్నిహితులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సచిన్ టెండూల్కర్, అజింక్య రహానే, శిఖర్ ధావన్, చతేశ్వర్ పుజారా, రవీంద్ర జడేజా, ఉమేశ్ యాదవ్, సురేశ్ రైనా తదితరులు పెళ్లికి వచ్చారు. యువరాజ్, సురేశ్ రైనా కూడా విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్లకు విరామం ఇచ్చి సహచరుడు వివాహ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెళ్లికి రెండు రోజుల ముందు శుక్రవారం రాత్రి రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తమ ముంబై జట్టు కెప్టెన్ అయిన రోహిత్ శర్మ దంపతుల కోసం ప్రత్యేకంగా ఇచ్చిన పార్టీకి కూడా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.