రోహిత్‌ శర్మ పుత్రికోత్సాహం | Rohit Sharma Shares Adorable Pic Of His Family | Sakshi
Sakshi News home page

‘హెలో వరల్డ్‌... 2019 బాగుండాలి’

Published Fri, Jan 4 2019 10:36 AM | Last Updated on Fri, Jan 4 2019 11:08 AM

Rohit Sharma Shares Adorable Pic Of His Family - Sakshi

రోహిత్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన ఫొటో

టీమిండియా ఆటగాడు‌, హిట్‌మాన్‌ రోహిత్‌ శర్మ పుత్రికోత్సాహంతో పొంగిపోతున్నాడు. ఆటకు కాస్త విరామం ఇచ్చి కుటుంబంతో కలిసి ఎంజాయ్‌ చేస్తున్నాడు. రోహిత్‌ భార్య రితిక ఆదివారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తల్లిదండ్రులుగా మారిన తర్వాత తమ చిన్నారితో కలిసి మధుర క్షణాలను ఆస్వాదిస్తున్న ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసిన రోహిత్‌... ‘హెలో వరల్డ్‌.. 2019 మనందరికీ బాగుండాలి’ అని ట్వీట్‌ చేశాడు. ఈ ఫొటోపై లైకుల వర్షం కురిపిస్తున్న రోహిత్‌ అభిమానులు.. ‘భయ్యా మీ పాపాయికి రోహిక అనే పేరు పెడితే బాగుంటుంది’ అంటూ సలహాలు కూడా ఇస్తున్నారు.

కాగా కూతురిని చూసేందుకు భారత్‌కు వచ్చిన రోహిత్‌.. ఈ కారణంగా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో భాగంగా చివరిదైన నాల్గో టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఇక మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కోసం ఈ నెల 8న అతడు తిరిగి జట్టుతో చేరతాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement