
డ్రా దిశగా చివరి టెస్టు
చెన్నై: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్నచివరి టెస్టు డ్రా దిశగా సాగుతోంది. 12/0 ఓవర్ నైట్ స్కోరుతో చివరిరోజు రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ లంచ్ సమయానికి 37.0 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 97 పరుగులు చేసింది. తొలి సెషన్ ముగిసే నాటికి భారత్ కు వికెట్లు లభించకపోవడంతో మ్యాచ్లో ఫలితం వచ్చే అవకాశాలు కనబడుటం లేదు.
అద్భుతం ఏమైనా జరిగితే తప్పా మ్యాచ్లో ఫలితం వచ్చే అవకాశాలు తక్కువ. కేవలం భారత్ కు మాత్రమే విజయం సాధించే అవకాశం ఉండటంతో దాన్ని అడ్డుకోవడానికి ఇంగ్లండ్ శతవిధాలా ప్రయత్నిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ క్రమంలోనే ఇంగ్లండ్ నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 477 పరుగులు చేయగా, భారత్ తొలి ఇన్నింగ్స్ లో 759/7 వద్ద డిక్లేర్ చేసింది.