పటిష్టమైన జట్టునే ఎంపిక చేశారు  | India have strong side for ICC 2019 World Cup: Shikhar Dhawan | Sakshi
Sakshi News home page

పటిష్టమైన జట్టునే ఎంపిక చేశారు 

Published Wed, Apr 17 2019 1:14 AM | Last Updated on Wed, May 29 2019 2:38 PM

India have strong side for ICC 2019 World Cup: Shikhar Dhawan - Sakshi

న్యూఢిల్లీ: ఐసీసీ ప్రపంచకప్‌ కోసం అత్యంత పటిష్టమైన జట్టును భారత సెలక్టర్లు ఎంపిక చేశారని ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్‌ వెళ్లబోయే భారత జట్టు సమతూకంతో ఉందని పేర్కొన్నాడు. ‘ప్రపంచ కప్‌ మ్యాచ్‌లు ఆడేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. ఈ మెగా టోర్నీ కోసం సెలక్టర్లు అత్యత్తుమ జట్టును ఎంపిక చేశారు. ఒకసారి ఈ టోర్నీ కోసం ఇంగ్లండ్‌లో అడుగుపెట్టాక భారత్‌ అద్భుత ప్రదర్శనతో అదరగొడుతుంది’ అని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు.
 

ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ 15 మంది సభ్యులతో ప్రపంచకప్‌ భారత జట్టును సోమవారం ప్రకటించింది. ఈ జట్టుకు కోహ్లి కెప్టెన్‌గా, రోహిత్‌ శర్మ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. దినేశ్‌ కార్తీక్‌ రెండో వికెట్‌ కీపర్‌గా చాన్స్‌ కొట్టేశాడు. మే 30 నుంచి ఇంగ్లండ్‌లో ప్రపంచకప్‌ జరుగుతుంది. మరోవైపు ఈ సీజన్‌లో తమ జట్టు డిల్లీ క్యాపిటల్స్‌ ప్రదర్శన పట్ల ధావన్‌ హర్షం వ్యక్తం చేశాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement