
అశ్విన్ కు చోటు దక్కలేదు..
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం ఇక్కడ పాకిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ ప్రధాన స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ కు చోటు దక్కలేదు.
బర్మింగ్ హోమ్:చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం ఇక్కడ పాకిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ ప్రధాన స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ కు చోటు దక్కలేదు. ఇంగ్లండ్ లో ఫాస్ట్ పిచ్ లు కావడంతో పాటు జట్టును సమతుల్యంగా ఉంచేందుకు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను తుది జట్టులో ఉంచి, అశ్విన్ ను రిజర్వ్ బెంచ్ కే పరిమితం చేశారు. మరొకవైపు పాక్ తుది జట్టులో షాదాబ్ ఖాన్ కు చోటు కల్పించగా, ప్రధాన పేసర్ జునైద్ ఖాన్ కు విశ్రాంతి ఇచ్చారు. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ తొలుత ఫీల్డింగ్ చేసేందుకు మొగ్గు చూపాడు.
భారత తుది జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోని, కేదర్ జాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్, జస్ఫిత్ బూమ్రా
పాకిస్తాన్ తుది జట్టు: సర్ఫరాజ్ అహ్మద్(కెప్టెన్),అజహర్ అలీ, అహ్మద్ షెహజాద్, మొహ్మద్ హఫీజ్, బాబర్ అజమ్, షోయబ్ మాలిక్, ఇమాద్ వసీం, షాదబ్ ఖాన్, మొహ్మద్ అమిర్, వహాబ్ రియాజ్, హసన్ అలీ