
ముంబై: రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో... ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగే మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో పాల్గొనే భారత మహిళల టి20 జట్టుకు స్మృతి మంధాన నాయకత్వం వహిస్తుంది. గువాహటిలో మార్చి 4, 7, 9వ తేదీల్లో ఇంగ్లండ్‌తో భారత్ మూడు టి20 మ్యాచ్‌లు ఆడుతుంది. భారత జట్టులో హైదరాబాద్ పేసర్ అరుంధతి రెడ్డి తన స్థానాన్ని నిలబెట్టుకుంది.
భారత మహిళల టి20 జట్టు: స్మృతి మంధాన (కెప్టెన్), మిథాలీ రాజ్, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, తానియా భాటియా (వికెట్ కీపర్), భారతి ఫుల్మాలి, అనూజా పాటిల్, శిఖా పాండే, కోమల్ జన్‌జాద్, అరుంధతి రెడ్డి, పూనమ్ యాదవ్, ఏక్తా బిష్త్, రాధ యాదవ్, వేద కృష్ణమూర్తి, హర్లీన్ డియోల్.
Comments
Please login to add a commentAdd a comment