ఫైల్ ఫోటో
మౌంట్ మాంగనీ: ఇప్పటికే తొలి రెండు వన్డేలను, దాంతోపాటు కివీస్‌కు సిరీస్‌ను సమర్పించుకున్న భారత్ మూడో వన్డేలోనూ కష్టాల దిశగా సాగుతోంది. టాస్ గెలిచిన కివీస్ కోహ్లి సేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించగా 32 పరుగులకే రెండు కీలకమైన వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 1 పరుగుకే పెవిలియన్ చేరగా.. కెప్టెన్ విరాట్ కోహ్లి (12 బంతుల్లో 9 పరుగులు; 1 ఫోర్) మరోసారి విఫలమయ్యాడు. 2-0తో సిరీస్ గెలుచుక్ను ఆతిథ్య న్యూజిలాండ్ టీ20 వైట్‌వాష్‌కు ప్రతీకారం తీర్చుకోవాలని ఉవ్విళ్లూరుతుండగా.. నామమాత్రమైన మ్యాచ్‌లో గెలిచి పరువు నిలుపుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. తొలి వన్డేలో 51 పరుగులు చేసి రాణించిన కింగ్ కోహ్లి, రెండో వన్డేలో 15 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఇక మాయాంక్ తొలి వన్డేలో 32 పరుగులతో రాణించగా..రెండో వన్డేలో 3 పరుగులు మాత్రమే చేశాడు.
(చదవండి : మ్యాచ్‌తో పాటు సిరీస్ కూడా... )
Comments
Please login to add a commentAdd a comment