
పాక్ పై భారత్ ఘనవిజయం
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఖాతా తెరిచింది.
బర్మింగ్ హోమ్:
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఖాతా తెరిచింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై అద్భుతం విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్‌లలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. పలుమార్లు వర్షం అంతరాయం కలిగించినా..చివరకు 124 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. అంతకు ముందు కోహ్లీసేన 48 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది.
వర్షం కురవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 41 ఓవర్లకు 289పరుగుల లక్ష్య చేదనలో పాక్ చతికిల పడింది. 33.4 ఓవర్లలో 164 పరుగులకే పాక్ ఆలౌట్ అయింది. 32 బంతుల్లో 53 పరుగులతో చెలరేగిన యువరాజ్ సింగ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.