భారత్దే టి-20 సిరీస్ | Indian eves beat SL in 2nd T20, clinch series | Sakshi
Sakshi News home page

భారత్దే టి-20 సిరీస్

Published Wed, Feb 24 2016 3:09 PM | Last Updated on Sun, Sep 3 2017 6:20 PM

భారత్దే టి-20 సిరీస్

భారత్దే టి-20 సిరీస్

శ్రీలంకతో మూడు టి-20ల సిరీస్లో భారత మహిళల జట్టు వరుసగా రెండో విజయం సాధించింది.

రాంచీ: శ్రీలంకతో మూడు టి-20ల సిరీస్లో భారత మహిళల జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. బుధవారం జరిగిన రెండో టి-20లో భారత్ ఐదు వికెట్లతో గెలుపొంది.. మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ను 2-0తో సొంతం చేసుకుంది. భారత కెప్టెన్ మిథాలీ రాజ్ (51) అజేయ హాఫ్ సెంచరీ చేయడంతో పాటు బౌలర్లు ఏక్తా బిస్త్, పూనమ్ యాదవ్ చెరో మూడు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన లంక నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. దిలానీ మనోదర 27, సిరివర్దనె 26, జయంగని 22 పరుగులు చేశారు. అనంతరం 108 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఐదు వికెట్లు కోల్పోయి మరో ఆరు బంతులు మిగిలుండగా విజయం సాధించింది. మిథాలీ రాజ్ హాఫ్ సెంచరీతో పాటు అనూజా పాటిల్ 34 పరుగులు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement