భారత్ తొలి పోరు అర్జెంటీనాతో | India's first war with Argentina | Sakshi
Sakshi News home page

భారత్ తొలి పోరు అర్జెంటీనాతో

Published Thu, Sep 24 2015 1:16 AM | Last Updated on Sun, Sep 3 2017 9:51 AM

భారత్ తొలి పోరు అర్జెంటీనాతో

భారత్ తొలి పోరు అర్జెంటీనాతో

హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్స్ టోర్నీ షెడ్యూల్ విడుదల
 
 లుసానే (స్విట్జర్లాండ్): స్వదేశంలో జరిగే హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్స్ టోర్నమెంట్‌లో ఆతిథ్య భారత జట్టు తొలి మ్యాచ్‌లో అర్జెంటీనాతో తలపడనుంది. ఈ ఏడాది నవంబరు 27 నుంచి డిసెంబరు 6 వరకు జరిగే ఈ మెగా ఈవెంట్‌కు చత్తీస్‌గఢ్ రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) బుధవారం విడుదల చేసింది.  పూల్ ‘బి’లో భారత్, అర్జెంటీనా, నెదర్లాండ్స్, జర్మనీ... పూల్ ‘ఎ’లో ఆస్ట్రేలియా, బెల్జియం, బ్రిటన్, కెనడా జట్లు ఉన్నాయి.

తొలి రోజు నవంబరు 27న అర్జెంటీనాతో భారత్; డిఫెండింగ్ చాంపియన్ నెదర్లాండ్స్‌తో ఒలింపిక్ చాంపియన్ జర్మనీ తలపడతాయి. అనంతరం భారత్ 28న జర్మనీతో; 30న నెదర్లాండ్స్‌తో ఆడుతుంది. డిసెంబరు 4, 5న సెమీఫైనల్స్, డిసెంబరు 6న ఫైనల్ జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement