కురుణెగల: శ్రీలంక పర్యటనలో భారత్ అండర్-19 యూత్ జట్టు తొలి విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం ఇక్కడ జరిగిన రెండో వన్డేలో 22 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును ఓడించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దయ్యింది. వెలగెడెరా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 48.4 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ విజయ్ జోల్ (67), అంకుష్ బయాన్స్ (38), హర్వాడ్కర్ (33) రాణించారు.
ఆంధ్ర ఆటగాడు రికీ బుయ్ (24), ఆమిర్ ఘని (25) ఫర్వాలేదనిపించారు. కరుణరత్నే 4, అనురుడ్డ 3, ననయకారా 2 వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన లంక 47 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. సుమనశ్రీ (73 నాటౌట్) టాప్ స్కోరర్. పెరీరా (47), సమరవిక్రమ (36) లు రాణించారు. సుమనశ్రీ, పెరీరాలు నాలుగో వికెట్‌కు 74 పరుగులు జోడించి ఆదుకునే ప్రయత్నం చేశారు. లాంబా 3, కుల్దీప్ యాదవ్, ఆమిర్ ఘని చెరో రెండు వికెట్లు తీశారు. ఇరుజట్ల మధ్య ఆఖరి వన్డే గురువారం దంబుల్లాలో జరుగుతుంది.
భారత్‌కు తొలి విజయం
Published Wed, Aug 7 2013 2:31 AM | Last Updated on Fri, Nov 9 2018 6:46 PM
Advertisement
Advertisement