స్లామర్స్‌తో ఏసెస్ అమీతుమీ | International Premier Tennis League 2 titles | Sakshi
Sakshi News home page

స్లామర్స్‌తో ఏసెస్ అమీతుమీ

Published Sun, Dec 20 2015 1:23 AM | Last Updated on Sun, Sep 3 2017 2:15 PM

International Premier Tennis League  2 titles

 నేడు ఐపీటీఎల్-2 టైటిల్ పోరు
 మధ్యాహ్నం గం. 1.30 నుంచి
 స్టార్ స్పోర్ట్స్-4లో ప్రత్యక్ష ప్రసారం

 
 సింగపూర్: వరుసగా రెండో ఏడాది అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్) టైటిల్‌ను నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో ఇండియన్ ఏసెస్... తొలిసారి విజేతగా అవతరించాలనే పట్టుదలతో సింగపూర్ స్లామర్స్... ఈ నేపథ్యంలో ఈ రెండు జట్ల మధ్య ఆదివారం ఐపీటీఎల్-2 టైటిల్ పోరు జరగనుంది. శనివారంతో రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లు ముగిశాయి. లీగ్ మ్యాచ్‌ల తర్వాత ఇండియన్ ఏసెస్, సింగపూర్ స్లామర్స్ జట్లు పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించాయి. శనివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ఇండియన్ ఏసెస్ 21-27 గేమ్‌ల తేడాతో సింగపూర్ స్లామర్స్ చేతిలో ఓడిపోయింది. మరో మ్యాచ్‌లో ఫిలిప్పీన్ మావెరిక్స్ 24-23 గేమ్‌ల తేడాతో యూఏఈ రాయల్స్ జట్టును ఓడించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement