వేడిని తట్టుకోలేక ఇలా ప్రాక్టీస్ చేస్తున్నారు.. | IPL players shirtless practice due to heat | Sakshi
Sakshi News home page

వేడిని తట్టుకోలేక ఇలా ప్రాక్టీస్ చేస్తున్నారు..

Published Thu, Apr 20 2017 6:13 PM | Last Updated on Tue, Sep 5 2017 9:16 AM

వేడిని తట్టుకోలేక ఇలా ప్రాక్టీస్ చేస్తున్నారు..

వేడిని తట్టుకోలేక ఇలా ప్రాక్టీస్ చేస్తున్నారు..

ఇండోర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 సీజన్ లో భాగంగా  గురువారం ఇక్కడ హెల్కార్ క్రికెట్ స్టేడియంలో  ముంబై ఇండియన్స్- కింగ్స్ పంజాబ్ జట్లు తలపడనున్నాయి. రాత్రి గం.8.00 లకు ఆరంభమయ్యే మ్యాచ్ లో విజయంపై ఇరు జట్లు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇరు జట్ల ఆటగాళ్లు బుధవారం తీవ్రంగా ప్రాక్టీస్ చేశారు. అయితే విదేశీ ఆటగాళ్లు వేడిని తట్టుకోలేకపోతున్నారు. ఎండ తీవ్రత బాగా పెరగడంతో చొక్కాలు తీసేసి ప్రాక్టీస్ చేస్తున్నారు.  


ముంబైతో జరిగే మ్యాచ్ లో ఎలాగైనా విజయం సాధించాలని కింగ్స్ పంజాబ్ భావిస్తోంది. వరుస పరాజయాలతో టోర్నీలో కాస్త డీలా పడిన కింగ్స్ పంజాబ్ గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. దాంతో పాటు తమకు అచ్చొచిన ఇండోర్ స్టేడియంలో గెలుస్తామనే ధీమా కూడా కింగ్స్ ఆటగాళ్లలో మెండుగా కనిపిస్తోంది. ఈ స్టేడియంలో కింగ్స్ పంజాబ్ రెండు మ్యాచ్ లు ఆడగా ఆ రెండింటిలోనూ విజయం సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement