
కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని
ఎన్‌ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ): చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బుధవారం సాయంత్రం నగరానికి చేరుకుంది. జట్టు సభ్యులకు విశాఖ విమానాశ్రయంలో సాదర స్వాగతం లభించింది. కెప్టెన్ ధోని, జట్టు సభ్యులు సురేష్ రైనా, హర్బజన్‌సింగ్, డుప్లెసిస్, షేన్ వాట్సన్, మురళీ విజయ్, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ఇమ్రాన్ తాహిర్, దీపక్ చహర్, డ్వేన్ బ్రేవో, మోహిత్‌శర్మ తదితరులు విశాఖ చేరుకున్నారు. మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో ఓటమి చెందిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు శుక్రవారం నగరంలోని డాక్టర్ వైఎస్‌ఆర్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఎలిమినేషన్ ఆడనుంది. బుధవారం ఎలిమినేషన్ మ్యాచ్‌లో గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో చైన్నై తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment