ఇరానీ ట్రోఫీ: ముంబై 386/3 | Irani Trophy: Mumbai 386/3 | Sakshi
Sakshi News home page

ఇరానీ ట్రోఫీ: ముంబై 386/3

Published Mon, Mar 7 2016 1:39 AM | Last Updated on Sun, Sep 3 2017 7:09 PM

Irani Trophy: Mumbai 386/3

ముంబై: రంజీ చాంపియన్ ముంబై జట్టు ఇరానీ ట్రోఫీలోనూ దుమ్మురేపే ఆటతీరును ప్రదర్శిస్తోంది. ఓపెనర్ జై బిస్టా (90 బంతుల్లో 104; 15 ఫోర్లు; 1 సిక్స్) ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో తొలి సెంచరీ సాధించగా మరో ఓపెనర్ అఖిల్ హెర్వాడ్కర్ (148 బంతుల్లో 90; 15 ఫోర్లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై తొలి రోజు తమ తొలి ఇన్నింగ్స్‌లో 83 ఓవర్లలో 3 వికెట్లకు 386 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (125 బంతుల్లో 88 బ్యాటింగ్; 15 ఫోర్లు; 1 సిక్స్),  శ్రేయాస్ అయ్యర్ (49 బంతుల్లో 55; 10 ఫోర్లు) రాణించారు. ఆదిత్య తారే (86 బంతుల్లో 38 బ్యాటింగ్; 4 ఫోర్లు), సూర్యకుమార్ క్రీజులో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement