Aditya Tare
-
నీ వల్లే ద్రవిడ్‌కు ఎప్పుడూ లేనంత కోపం వచ్చింది! ఆరోజు నేను సిక్స్ కొట్టడంతో..
Mumbai Indians vs Rajasthan Royals 2014: ‘‘అప్పుడు నేను ద్రవిడ్ రియాక్షన్ చూడలేదు. కానీ ఆయన చాలా సీరియస్ అయ్యారని చాలా మంది చెప్పారు. నీ వల్లే రాహుల్ ద్రవిడ్‌కు ఎన్నడూ లేనంత కోపం వచ్చింది. ఆయనను మేము ఎప్పుడూ అలా చూడలేదు’’ అంటూ ముంబై వికెట్ కీపర్ బ్యాటర్ ఆదిత్య తారే 2014 నాటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు. ముంబై తరఫున అరంగేట్రం మహారాష్ట్రకు చెందిన ఆదిత్య 2010లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అడుగుపెట్టాడు. ముంబై ఇండియన్స్‌తో ఐపీఎల్లో అడుగుపెట్టిన అతడు.. అదే జట్టు మీద ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున 2017లో ఆఖరి మ్యాచ్ ఆడాడు. తన కెరీర్లో మొత్తంగా ఇప్పటి వరకు ఐపీఎల్లో 35 మ్యాచ్‌లు ఆడిన ఆదిత్య 339 పరుగులు చేశాడు. ఇందులో ఓ అర్ధ శతకం ఉంది. కీలక పోరులో ఇక ఆదిత్య తారే కెరీర్లో 2014 నాటి.. ముంబై ఇండియన్స్- రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్ తప్పక గుర్తుండిపోతుంది. ఆ సీజన్లో ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో రాజస్తాన్, ముంబై మధ్య కీలక పోరు జరిగింది. వాంఖడేలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. అయితే, రన్‌రేటు దృష్ట్యా ఈ మ్యాచ్‌లో ముంబై సుమారు 14.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించాల్సిన పరిస్థితి. లేనిపక్షంలో రాజస్తాన్ ప్లే ఆఫ్స్ చేరితే.. ముంబై ఇంటిబాట పట్టాల్సి వస్తుంది. ఆదిత్య తారే, ద్రవిడ్ రియాక్షన్ ఆండర్సన్, రాయుడు విజృంభించడంతో ఇలాంటి ఉత్కంఠభరిత స్థితిలో ముంబై ఇండియన్స్ ఓపెనర్లు లెండిల్ సిమ్మన్స్(12), మైకేల్ హస్సీ(22) పూర్తిగా నిరాశపరిచారు. ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ కోరే ఆండర్సర్ తుపాన్ ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. బౌండరీలు, సిక్సర్ల వర్షంతో 44 బంతుల్లోనే 95 పరుగులు చేసిన అతడు ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. అంబటి రాయుడు(10 బంతుల్లో 30 పరుగులు) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అతడికి సహకరించాడు. ఇక 15వ ఓవర్ మూడో బంతికి.. క్రీజులో ఉన్న ఆదిత్య తారే బౌండరీ కొడితే ముంబై ప్లే ఆఫ్స్ చేరడం ఖాయం. లేదంటే రాజస్తాన్ టాప్-4లో అడుగుపెడుతుంది. నరాలు తెగే ఉత్కంఠ నరాలు తెగే ఉత్కంఠ రేపిన ఆ బంతికి ఆదిత్య ఏకంగా సిక్సర్ బాదడంతో ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొంది ప్లే ఆఫ్స్ చేరుకుంది. అప్పటిదాకా ప్లే ఆఫ్ బెర్తు తమదే అని సంతోష పడ్డ రాజస్తాన్‌కు నిరాశ తప్పలేదు. ఇక ఆదిత్య సిక్స్ కొట్టడంతో నాటి.. రాజస్తాన్ రాయల్స్ హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ కోపంతో ఊగిపోయాడు. తమ జట్టు ఓడి ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించడంతో ఎన్నడూ లేని విధంగా సీరియస్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కొత్తగా కనిపించాడు. ఈ విషయం గురించి తాజాగా స్టార్ స్పోర్ట్స్ షోలో ఆదిత్య తారే గుర్తు చేసుకున్నాడు. అదే ద్రవిడ్ కోపానికి కారణం ‘‘నేను ఆ బంతిని గాల్లోకి లేపే ముందు తామే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించామని రాజస్తాన్ ఫిక్సైపోయింది. డగౌట్లో ఉన్న వాళ్ల ముఖాలు సంతోషంతో నిండిపోయాయి. అయితే, అప్పుడే మాకో విషయం తెలిసింది. మేము ప్లే ఆఫ్స్ చేరడానికి మాకు ఇంకో బంతి మిగిలే ఉంది. కాబట్టి బౌండరీ బాదాలని నిశ్చయించుకున్నాం. ముందేమో సిక్స్ కొట్టాలని భావించాం. తర్వాత తెలిసిందేంటే బౌండరీ బాదినా చాలని! అయితే, నేను అప్పటికే సిక్సర్ కొట్టాలని బలంగా నిశ్చయించుకున్నా. అదే అమలు చేశా. ఇదే ద్రవిడ్ కోపానికి కారణమైంది’’ అని 35 ఏళ్ల ఆదిత్య తారే చెప్పుకొచ్చాడు. కాగా 2014లో ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై కథ ముగియగా.. కేకేఆర్ విన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2023లో ఇప్పటికే డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకోగా.. మిగిలిన మూడు స్థానాల కోసం ఆరు జట్లు పోటీపడుతున్నాయి. చదవండి: చిక్కుల్లో చెన్నై సూపర్ కింగ్స్.. కేసు నమోదు! ఎందుకంటే? గావస్కర్..సెహ్వాగ్ దగ్గరకు రాడు! వీరూనే వెళ్లాలి.. అర్థమైందా? వాళ్లిద్దరు అంతే! -
17 ఏళ్ల బంధానికి స్వస్తి పలికిన క్రికెటర్
రంజీ సీనియర్ ఆటగాడు.. 34 ఏళ్ల ఆదిత్య తారే ముంబై క్రికెట్ అసోసియేషన్‌తో ఉన్న 17 ఏళ్ల బంధానికి స్వస్తి పలికాడు. వచ్చే సీజన్ నుంచి ఆదిత్య తారే ఉత్తరాఖండ్ తరపున ఆడే అవకాశాలు ఉన్నాయి. వచ్చే డొమొస్టిక్ సీజన్ కోసం ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రకటించిన 47 మంది సీనియర్ క్రికెటర్ల లిస్టులో ఆదిత్య తారే పేరు కనిపించలేదు. దీంతో ముంబైతో తారే బంధం ముగిసిందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తారే స్వయంగా స్పందించాడు. ''ముంబై జట్టుతో ఉన్న నా 17 ఏళ్ల బంధం నేటితో ముగిసింది. ముంబై నుంచి విడిపోతున్నా అనే పదం చెప్పడం నాకు బాధను కలిగిస్తోంది. అది ఎలా వివరించాలో కూడా అర్థం కావడం లేదు. 16 ఏళ్ల వయసులో అండర్-17 విభాగంలో ముంబైకి తొలిసారి ప్రాతినిధ్యం వహించాను. అప్పటినుంచి దాదాపు 17 ఏళ్ల పాటు ముంబై తరపున అన్ని దేశవాలీ టోర్నీల్లో పాల్గొనడం గర్వంగా అనిపిస్తోంది. ఈ మార్గంలో నేను కొన్నిసార్లు విజయాలు అందుకున్నా. అలాగే విమర్శలతో పాటు వైఫల్యాలను కూడా సహించాను. విజయాలైనా, ఓటములైనా మ్యాచ్ వరకు మాత్రమే. ఈ 17 ఏళ్లలో నా సహచరులతో గడిపిన క్షణాలు నాకు మంచి జ్ఞాపకాలు. నేను ఎక్కువగా మిస్ అయ్యే విషయం ముంబై డ్రెస్సింగ్ రూమ్. ఇది ఒక ప్రత్యేకమైన ప్రదేశం.. కొందరు అద్భుతమైన ఆటగాళ్లను చూశాను. అలాగే ముంబై తరపున ఆడుతూ సహచరుల అభినందనలు పొందడం ఎన్నటికి మరిచిపోను'' అంటూ తారే భావోద్వేగంతో చెప్పుకొచ్చాడు. ఇక ఆదిత్య తారే ముంబై తరపున 80 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, 73 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడాడు. 2015-16 రంజీ సీజన్లో ఆదిత్య తారే నేతృత్వంలోని ముంబై జట్టు రికార్డు స్థాయిలో 41వ సారి రంజీ టైటిల్‌ను అందుకోవడం విశేషం. ఇక ఐపీఎల్‌లోనూ ఎక్కువ శాతం ముంబై ఇండియన్స్‌కు ఆడిన ఆదిత్య తారే 35 మ్యాచ్‌ల్లో 339 పరుగులు సాధించాడు. చదవండి: IND Vs PAK Asia Cup 2022: ఫీల్డింగ్ పరిమితుల గొడవేంటి.. ఐసీసీ కొత్త రూల్స్ ఏంటంటే! రోజుకు 150 సిక్స్‌లు కొడుతున్నా అన్నావు.. ఇప్పుడు ఏమైంది భయ్యా నీకు? -
షా విధ్వంసం.. తారే సూపర్ సెంచరీ.. ముంబై చాంపియన్
న్యూఢిల్లీ: దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీని ముంబై జట్టు నాలుగోసారి ఎగురేసుకుపోయింది. ముంబై కెప్టెన్ పృథ్వీ షా (39 బంతుల్లో 73; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) ధనాధన్ ఇన్నింగ్స్‌కు, వికెట్‌కీపర్ బ్యాట్స్‌మెన్ ఆదిత్య తారే (107 బంతుల్లో 118 నాటౌట్; 18 ఫోర్లు) అద్భుత శతకం తోడవ్వడంతో పాటు శివం దూబే(42 నాటౌట్; 28 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగి ఆడటంతో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో యూపీపై ఘన విజయం సాధించింది. ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఉత్తర్‌ప్రదేశ్ జట్టు.. ఓపెనర్ మాధవ్ కౌశిక్ (156 బంతుల్లో 158 నాటౌట్; 15 ఫోర్లు, 4 సిక్సర్లు) భారీ శతకం సాధించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 312 పరుగులు సాధించింది. కౌశిక్ శతకానికి మరో ఓపెనర్ సమర్థ్ సింగ్ (73 బంతుల్లో 55; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ అక్షదీప్‌నాథ్ (40 బంతుల్లో 55; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్థశతకాలు తోడవ్వడంతో యూపీ జట్టు ముంబైకు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ముంబై బౌలర్లలో యశ్ దయాల్, శివమ్ మావి, శివమ్ శర్మ, సమీర్ చౌదరీలు తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం ఛేదనలో పృథ్వీ షా (39 బంతుల్లో 73 పరుగులు), ఆదిత్య తారే (107 బంతుల్లో 118 నాటౌట్; 18 ఫోర్లు) అద్భుతంగా రాణించడంతో ముంబై జట్టు భారీ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించి టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. ముంబై జట్టులో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (30 బంతుల్లో 29; 3 ఫోర్లు, సిక్స్), షమ్స్ ములాని (43 బంతుల్లో 36; 2 సిక్సర్లు), ఆల్‌రౌండర్ శివమ్ దూబే దూకుడుగా ఆడడంతో ముంబై 41.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. యూపీ బౌలర్లు తనుశ్ కోటియన్ 2, ప్రశాంత్ సోలంకీ ఒక వికెట్ సాధించారు. -
మొన్న ట్రిపుల్ సెంచరీ.. మళ్లీ డబుల్ సెంచరీ
ధర్మశాల: రంజీ ట్రోఫీలో ముంబై బ్యాట్స్‌మన్ సర్ఫరాజ్ ఖాన్ జోరు కొనసాగుతోంది. వారం రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ట్రిపుల్ సెంచరీ సాధించిన సర్ఫరాజ్ ఖాన్.. తాజాగా హిమాచల్‌ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించాడు. సోమవారం ప్రారంభమైన మ్యాచ్‌లో తొలి రోజు మూడో సెషన్లో సర్ఫరాజ్ డబుల్ సెంచరీ నమోదు చేశాడు. ఆది నుంచి హిమాచల్ ప్రదేశ్ బౌలర్లపై విరుచుకుపడ్డ సర్పరాజ్ వందకుపైగా స్టైక్‌రేట్‌తో డబుల్ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం ద్విశతకతంతో అజేయంగా నిలిచి మరో ట్రిపుల్ సెంచరీ దిశగా సాగుతున్నాడు.(ఇక్కడ చదవండి: సర్ఫరాజ్ ట్రిపుల్ సెంచరీ) 213 బంతుల్లో 32 ఫోర్లు, 4 సిక్సర్లతో 226 పరుగులతో ఉన్నాడు. కాగా, రెండో రోజు ఆటకు వరుణుడు అంతరాయం కల్గించాడు. దాంతో మ్యాచ్ ప్రారంభం కావడానికి ఆలస్యం కానుంది.నిన్నటి ఆటలో 71 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ముంబై జట్టును సర్ఫరాజ్ తన వీరోచిత బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. బౌలర్ ఎవరన్నది చూడకుండా బౌండరీలే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ క్రమంలోనే తొలుత సెంచరీ పూర్తి చేసుకున్న సర్ఫరాజ్.. దాన్ని డబుల్ సెంచరీగా మార్చుకున్నాడు. ఐదో వికెట్‌కు ఆదిత్య తారేతో కలిసి 140 భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి అజేయంగా ఉన్న సర్ఫరాజ్ ఖాన్.. రెండో రోజు ఆటలో మరి డబుల్ సెంచరీని ట్రిపుల్‌గా మార్చుకుంటాడో లేదో చూడాలి. -
30 ఫోర్లు, 8 సిక్సర్లతో ట్రిఫుల్ సెంచరీ
ముంబై: యువ బ్యాట్స్‌మన్ సర్ఫరాజ్ ఖాన్ రంజీ ట్రోఫీలో సత్తా చాటాడు. అజేయ ట్రిఫుల్ సెంచరీతో చెలరేగాడు. ఉత్తరప్రదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో త్రిశతకం సాధించాడు. 391 బంతుల్లో 30 ఫోర్లు, 8 సిక్సర్లతో 301 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మూడో రోజైన మంగళవారం సెంచరీ సాధించిన సర్ఫరాజ్ ఆట నాలుగో రోజు బుధవారం ఏకంగా ట్రిఫుల్ సెంచరీ బాదేశాడు. ముంబై తరపున ఈ ఘనత సాధించిన ఏడో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఇంతకుముందు సునీల్ గావస్కర్, సంజయ్ మంజ్రేకర్, వసీం జాఫర్, రోహిత్ శర్మ, విజయ్ మర్చంట్, అజిత్ వాడేకర్ ఈ ఘనత సాధించారు. ముంబై బ్యాట్స్మన్లు ట్రిఫుల్ సెంచరీ సాధించడం ఇది ఎనిమిదోసారి. వసీం జాఫర్ రెండుసార్లు ట్రిఫుల్ సెంచరీలు చేశాడు. కాగా, ముంబై, యూపీ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో యూపీ 625/8 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ముంబై జట్టు 688/7 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ముంబై కెప్టెన్ ఆదిత్య తారే(97), సిద్ధేశ్ లాడ్(98) తృటిలో సెంచరీలు చేజార్చుకున్నారు. మాజీ టీమ్‌పైనే సత్తా చాటాడు.. ముంబైకి చెందిన సర్ఫరాజ్ ఖాన్ గత రంజీ సీజన్ ఆరంభం వరకు ఉత్తరప్రదేశ్ తరపున ఆడాడు. తర్వాత ముంబై జట్టుకు మారాడు. వాంఖేడే మైదానంలో 2015లో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో యూపీ తరపున బరిలోకి దిగిన సర్ఫరాజ్ కేవలం 44 పరుగులు మాత్రమే చేశాడు. మళ్లీ ముంబై తరపున ఆడతానని ఊహించలేదని, ఇదంతా కలలా ఉందని సర్ఫరాజ్ అన్నాడు. ముంబై జట్టు తరపున ట్రిఫుల్ సెంచరీ చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నాడు. -
తారె విజృంభణ.. గంభీర్ టీమ్‌కు షాక్
సాక్షి, బెంగళూరు : ముంబై మరో సారి మెరిసింది. విజయ్ హజారే 2018 ట్రోఫీని ముంబై వశం చేసుకుంది. శనివారం ఢిల్లీతో జరిగిన ఫైనల్లో టాపార్డర్ విఫలమైన మిడిలార్డర్ రాణించడంతో నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఢిల్లీ విసిరిన 178 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ముంబై జట్టు ఇబ్బందులు పడింది. చివరకు 35.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని పూర్తి చేసింది. నవదీప్ సైనీ(3/53) దెబ్బకు శ్రేయస్ సేన 40 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు పృథ్వీ షా(8), రహానే(10), సారథి శ్రేయస్ అయ్యర్ (7), సూర్యకుమార్ యాదవ్(4) విఫలమయ్యారు. ఈ క్రమంలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ఆదిత్య తారె (71), సిద్దేశ్ లాడ్(48)లు క్లిష్ట సమయంలో జట్టును ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు 105 పరుగులు జోడించిన అనంతరం తారె వెనుదిరిగాడు. ఇక చివర్లో శివం దుబె(19 నాటౌట్) మెరిసి ముంబై గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీకి అనుకున్న ఆరంభం లభించలేదు. గంభీర్ సేన 45.4 ఓవర్లలో 177 పరుగుల స్వల్పస్కోర్‌కే ఆలౌటైంది. స్టార్ బ్యాట్స్‌మ్‌న్ గౌతమ గంభీర్(1), ఉన్ముక్త్ చంద్ (13) దారుణంగా విఫలమయ్యారు. ఈ క్రమంలో జట్టును ధ్రువ్ షోరె(41), హిమ్మన్ సింగ్(31), పవన్ నేగి(21) రాణించడంతో ఢిల్లీ జట్టు గౌరవప్రదమైన స్కోర్ సాధించింది. ముంబై బౌలర్లలో ధావల్ కులకర్ణి(3/30), శివం దుబే(3/29), తుషార్(2/30)లు రాణించారు. -
'మంచి-చెడుల కలయికే టీ 20 ఫార్మాట్'
ముంబై: జీవితమనేది మంచి చెడుల కలయిక. చీకటి వెలుతురుల సమ్మేళనం. మన జీవితం అంటే కేవలం మనమే కాదు.. మన చుట్టూ ఉన్న పరిస్థితులే. దాన్నే మనం మంచి చెడుల కలయిక అభివర్ణిస్తుంటాం. అయితే టీ 20 క్రికెట్ అనేది క్రికెటర్ల జీవితాల్లో ప్రధాన భాగమై పోయింది. ఒక క్రికెటర్ జీవితాన్ని తారాస్థాయికి చేర్చాలన్నా.. మరో క్రికెటర్ జీవితాన్ని పాతాళానికి తొక్కేయేలన్నా ఇప్పుడు టీ 20 క్రికెట్ పైనే ఆధారపడి వుంది. అటు కెరీర్ పరంగా, ఇటు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి క్రికెటర్లకు ఒక వరంలా దొరికింది టీ 20ఫార్మాట్. ఇదే మాటను ముంబై రంజీ జట్టు కెప్టెన్, ముంబై ఇండియన్స్ ఆటగాడు ఆదిత్యా తారే తాజాగా స్పష్టం చేశాడు.' భారీ స్థాయిలో నగదును పెట్టుబడిగా పెట్టే గేమ్‌లలో ట్వంటీ 20 క్రికెట్ కూడా ఒకటి. తద్వారా క్రికెటర్లు మంచి జీవితాన్ని ఆస్వాదించడానికి ఆస్కారం దొరికింది. అదే సమయంలో ఈ ఫార్మాట్ క్రికెట్ స్పిన్నర్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ధనాధన్ క్రికెట్లో స్పిన్నర్లు రాణించడం కష్టంతో కూడుకున్న పని కాబట్టి వారి కెరీర్ అయోమయంలో పడే ప్రమాదం కూడా ఉంది. అయితే చెడు కంటే కూడా మంచే ఇక్కడ ఎక్కువగా ఉంది' అని ఆదిత్య తారే పేర్కొన్నాడు. టీ 20 జనరేషన్లో తాను క్రికెటర్‌గా ఉండటం నిజంగా అదృష్టమేనన్నాడు. తన పరంగా చూస్తే టీ 20 క్రికెట్లో చాలా సానుకూలాంశాలున్నాయన్నాడు. అటు ఆర్థికపరమైన వెసులుబాటుతో పాటు, విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఈ గేమ్ ద్వారానే తనకు లభించదన్నాడు. ఒక సౌలభ్యమైన జీవితాన్ని అనుభవించడానికి టీ 20 క్రికెట్ కారణమన్నాడు. ఈ గేమ్ ద్వారా చాలా మంది స్పాన్సర్లు మనల్ని కలుస్తుంటారని, అదే మన మొత్తం మైండ్ సెట్ లో మార్పును తీసుకొస్తుందన్నాడు. ఇదే సమయంలో టీ 20 ఫార్మాట్లో కొన్ని ప్రతికూలాంశాలను కూడా తారే ఎత్తి చూపాడు. ఒక నాణ్యమైన స్పిన్ బౌలర్‌పై టీ 20 ఫార్మాట్ ప్రభావం చూపిన దాఖలాలు చాలానే ఉన్నాయన్నాడు. ఇది బ్యాట్స్ మెన్ గేమ్ అయినందున, బంతి పోరాటం చేయడం చాలా కష్టమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. ప్రత్యేకంగా ఈ ఫార్మాట్లో స్పిన్నర్లు ప్రభావం చూపే అవకాశాలు తక్కువన్నాడు. టీ 20 ఫార్మాట్ ప్రవేశపెట్టిన కొత్తలో మన స్పిన్ బౌలర్లు బాగా ఇబ్బంది పడే సంగతిని తారే గుర్తు చేశాడు. కాగా, ఇప్పుడు టీ 20ల్లో భారత క్రికెట్ జట్టు ఇద్దరు నుంచి ముగ్గురు వరకూ మంచి స్పిన్నర్లను కల్గి ఉండటం నిజంగా అభినందనీయమన్నాడు. తాజా పరిస్థితుల్లో కనీసం ఇద్దరు స్పిన్నర్లతో టీమిండియా బరిలోకి దిగుతుందని, ఇది టీ 20 క్రికెట్ కు శుభపరిణామన్నాడు. -
ఇరానీ ట్రోఫీ: ముంబై 386/3
ముంబై: రంజీ చాంపియన్ ముంబై జట్టు ఇరానీ ట్రోఫీలోనూ దుమ్మురేపే ఆటతీరును ప్రదర్శిస్తోంది. ఓపెనర్ జై బిస్టా (90 బంతుల్లో 104; 15 ఫోర్లు; 1 సిక్స్) ఫస్ట్‌క్లాస్ కెరీర్లో తొలి సెంచరీ సాధించగా మరో ఓపెనర్ అఖిల్ హెర్వాడ్కర్ (148 బంతుల్లో 90; 15 ఫోర్లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై తొలి రోజు తమ తొలి ఇన్నింగ్స్‌లో 83 ఓవర్లలో 3 వికెట్లకు 386 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (125 బంతుల్లో 88 బ్యాటింగ్; 15 ఫోర్లు; 1 సిక్స్), శ్రేయాస్ అయ్యర్ (49 బంతుల్లో 55; 10 ఫోర్లు) రాణించారు. ఆదిత్య తారే (86 బంతుల్లో 38 బ్యాటింగ్; 4 ఫోర్లు), సూర్యకుమార్ క్రీజులో ఉన్నారు. -
ముంబై మెరుస్తుందా!
* 41వ టైటిల్‌పై కన్ను * నేటి నుంచి సౌరాష్ట్రతో రంజీ ఫైనల్ పుణే: రంజీ ట్రోఫీ చరిత్రలో ముంబై క్రికెట్ జట్టుకు ఘనమైన నేపథ్యం ఉంది. ఇప్పటిదాకా ఈ జట్టు రంజీ టైటిల్‌ను రికార్డు స్థాయిలో 40 సార్లు తమ ఖాతాలో వేసుకుంది. ఈనేపథ్యంలో ఈ సంఖ్యను పెంచుకునేందుకు ఆదిత్య తారే సేనకు చక్కటి అవకాశం లభించింది. నేటి (బుధవారం) నుంచి జరిగే ఫైనల్లో ముంబై జట్టు సౌరాష్ట్రను ఎదుర్కోనుంది. ఇది ముంబైకి 45వ ఫైనల్ కాగా సౌరాష్ట్రకు రెండోది. 2012-13లో ఈ రెండు జట్ల మధ్యే రంజీ ఫైనల్ జరిగింది. సచిన్ కూడా ఆడిన ఆ మ్యాచ్‌ను ముంబై మూడు రోజుల్లోనే ముగించి ఇన్నింగ్స్ 125 పరుగులతో నెగ్గడమే కాకుండా 40వ సారి టైటిల్ సాధించి చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత ముంబై జట్టు ప్రదర్శన అంత ఆశాజనకంగా సాగలేదు. మూడు సీజన్ల అనంతరం ఇప్పుడు మరోసారి ఇరు జట్లు ఢీకొనబోతున్నాయి. గత రికార్డును పరిశీలిస్తే 1990-91 తర్వా త ముంబై జట్టు తాము ఆడిన 10 ఫైనల్స్‌లోనూ నెగ్గి టైటిల్ ఎగరేసుకుపోయింది. క్రితం ఫైనల్లో ఆడిన ఆదిత్య తారే, అభిషేక్ నాయర్, ధావల్ కులకర్ణి, శార్దుల్ ఠాకూర్, విశాల్ దభోల్కర్ ఈసారి కూడా ఆడబోతున్నారు. మరోవైపు సౌరాష్ర్ట జట్టు గత ఫైనల్లో ఎదురైన ఓటమికి కసి తీర్చుకోవడంతో పాటు తమ తొలి టైటిల్ కోసం సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధపడుతోంది. ఆల్‌రౌండ్ నైపుణ్యంతో ముంబై ముంబై జట్టు అన్నిరకాలుగా పటిష్టంగానే కనిపిస్తోంది. బ్యాటింగ్‌లో శ్రేయాస్ అయ్యర్ (1204 పరుగులు), అఖిల్ హెర్వాడ్కర్ (879), సూర్యకుమార్ యాదవ్‌లతో లైనప్ బాగుంది. కెప్టెన్ తారే సెమీస్‌లో సెంచరీ సాధించి ఊపు మీదున్నాడు. బౌలర్ శార్దూల్ ఠాకూర్ (33 వికెట్లు) ఇప్పటికే జట్టు నుంచి టాప్‌లో ఉండగా ఇక్బాల్ అబ్దుల్లా (నాలుగు మ్యాచ్‌ల్లో 14 వికెట్లు) దూసుకెళుతున్నాడు. వీరికి సీనియర్లు ధావల్ కులకర్ణి, విశాల్ దభోల్కర్, బల్విందర్ సంధూ సహకారం అందించనున్నారు. బౌలర్లను నమ్ముకున్న సౌరాష్ట్ర జయదేవ్ షా నేతృత్వంలోని సౌరాష్ట్ర అవకాశాలు బౌలర్లపై ఆధారపడి ఉన్నాయి. ఈ జట్టు నుంచి ఇప్పటికే జయదేవ్ ఉనాద్కట్ (36 వికెట్లు), స్పిన్నర్లు కమలేష్ మక్వానా (33), ధర్మేంద్ర (27) ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచి జట్టుకు విజయాలు అందించారు. బ్యాటింగ్‌లో చతేశ్వర్ పుజారా, షెల్డన్ జాక్సన్ రాణింపు కీలకం. ఉ. గం. 9.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం