బర్మింగ్‌హామ్ : ఇంగ్లండ్‌కు ప్రతిష్టాత్మకమైన 1000వ టెస్టులో ఆ టీమ్ కెప్టెన్, స్టార్ క్రికెటర్ జో రూట్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో 6 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు రూట్. ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నా.. మరో ఎండ్‌లో పాతుకుపోయి భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ ఇంగ్లండ్ కెప్టెన్ బ్యాటింగ్ చేశాడు. టెస్టుల్లో 6000 పరుగుల మైలురాయి చేరుకున్న అత్యంత పిన్న వయసు క్రికెటర్లలో రూట్ (27 ఏళ్ల 214 రోజులు) మూడో స్థానంలో నిలిచాడు. ఓవరాల్‌గా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (26 ఏళ్ల 213 రోజులు), ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ (27 ఏళ్ల 43 రోజులు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
ఓపెనర్ కుక్ (13)ను స్పిన్నర్ అశ్విన్ అద్భుత బంతికి క్లీన్‌బౌల్డయి వెనుదిరిగాడు. ఆపై మరో ఓపెనర్ జెన్నింగ్స్ (42 : 98 బంతుల్లో 4 ఫోర్లు)తో కలిసి రూట్ రెండో వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. ఈ క్రమంలో 6వేల మార్కును చేరుకున్న రూట్.. టెస్టుల్లో అరంగేట్రం చేసిన అతి తక్కువ కాలానికే (2,058 రోజుల వ్యవధిలోనే) ఈ ఫీట్ నమోదు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. మలాన్(8) విఫలం కాగా, కీపర్ జానీ బెయిర్‌స్టో (40 నాటౌట్), రూట్ (76 నాటౌట్) స్కోరు బోర్డుకు పరుగులు జత చేస్తున్నారు.
58 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ 3 వికెట్లు నష్టపోయి 187 పరుగులు చేసింది. మహ్మద్ షమీ రెండు వికెట్లు సాధించగా, అశ్విన్‌కు ఓ వికెట్ దక్కింది.
ఈ టెస్టులో హాఫ్ సెంచరీ చేసిన జో రూట్.. భారత్‌పై ఆడిన ప్రతి టెస్టు (ఏదైనా ఇన్నింగ్స్ )లో ఓ అర్ధ శతకం చేసిన ఆటగాడిగా అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఓవరాల్‌గా భారత్‌పై టెస్టుల్లో 12 హాఫ్ సెంచరీలు సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment