జాతీయ సీనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు స్వర్ణం లభించింది. న్యూఢిల్లీలో శుక్రవారం జరిగిన పురుషుల ట్రాప్ టీమ్ ఈవెంట్‌లో కైనన్ చెనాయ్, దరియస్ చెనాయ్, గౌతమ్‌లతో కూడిన ఆంధ్రప్రదేశ్ జట్టు పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది.
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు స్వర్ణం లభించింది. న్యూఢిల్లీలో శుక్రవారం జరిగిన పురుషుల ట్రాప్ టీమ్ ఈవెంట్‌లో కైనన్ చెనాయ్, దరియస్ చెనాయ్, గౌతమ్‌లతో కూడిన ఆంధ్రప్రదేశ్ జట్టు పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ ముగ్గురు కలిసి మొత్తం 349 పాయింట్లు స్కోరు చేశారు. యూపీ, తమిళనాడు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. వ్యక్తిగత విభాగంలో కైనన్ రజత పతకం సాధించాడు.
గగన్‌కు కాంస్యం: మరోవైపు పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గగన్ నారంగ్ కాంస్య పతకం సాధించాడు. ఫైనల్ రౌండ్‌లో గగన్ నారంగ్ 183.6 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచాడు.