
న్యూఢిల్లీ: క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన 24 ఏళ్ల తర్వాత భారత దిగ్గజం కపిల్ దేవ్ మరోసారి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఈ సారి బరిలోకి దిగే మైదానం మాత్రం మారింది. సరదాగా మొదలు పెట్టిన గోల్ఫ్‌లో ప్రొఫెషనల్‌గా ఎదిగిన ‘హరియాణా హరికేన్’ ఇప్పుడు 59 ఏళ్ల వయసులో మళ్లీ దేశానికి ప్రాతినిధ్యం వహించబోతున్నాడు.
2018 ఆసియా పసిఫిక్ సీనియర్ గోల్ఫ్ టోర్నీలో పాల్గొనే ముగ్గురు సభ్యుల భారత జట్టులో కపిల్‌కు చోటు దక్కింది. జపాన్‌లోని మియాజాకిలో అక్టోబర్ 17 నుంచి ఈ టోర్నీ జరుగుతుంది. ఇటీవల నోయిడాలో జరిగిన ఆలిండియా సీనియర్ టోర్నీలో కపిల్ మూడో స్థానంలో నిలిచి అర్హత సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment