బెంగళూరు: ఐపీఎల్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 206 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. విరాట్ కోహ్లి(84; 49 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు), ఏబీ డివిలియర్స్(63; 32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు)లు చెలరేగడంతో ఆర్సీబీ భారీ స్కోరు సాధించింది. వీరిద్దరూ రెండో వికెట్‌కు వందకు పైగా భాగస్వామ్యాన్ని నమోదు ఆర‍్సీబీ భారీ స్కోరు చేయడంలో సహకరించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి శుభారంభం లభించింది. పార్థివ్ పటేల్, కోహ్లిలు తొలి వికెట్‌కు 64 పరుగులు జత చేశారు. అయితే పార్ధివ్(25) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు.
ఆ తరుణంలో కోహ్లికి జత కలిసిన డివిలియర్స్ నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించాడు. మరొకవైపు కోహ్లి బ్యాట్ ఝుళిపించడంతో ఆర్సీబీ 11 ఓవర్‌లో 90 పరుగులు చేసింది. ఈ క్రమంలోనే కోహ్లి అర్థ శతకాన్ని సాధించాడు. అనంతరం కోహ్లి చెలరేగి బ్యాటింగ్ చేయడంతో ఆర్సీబీ స్కోరు బోర్డు పరుగులు తీసింది. మరొక ఎండ్‌లో డివిలియర్స్ కూడా ధాటిగా బ్యాటింగ్ చేశాడు. ఈ జోడి 108 పరుగులు భాగస్వామ్యాన్ని సాధించిన తర్వాత కోహ్లి రెండో వికెట్ ఔట్ కాగా, ఆపై కాసేపటికి డివిలియర్స్ కూడా పెవిలియన్ చేరాడు. ఇక చివర్లో స్టోయినిస్ 13 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 28 పరుగులు చేశాడు. దాంతో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్, కుల్దీప్ యాదవ్, నితీశ్ రాణాలకు తలో వికెట్ దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment